గణేశ్ చవితి అంటేనే యూత్‌లో క్రేజ్. ఆ పదకొండు రోజులు ఆటవిడుపు. సినిమా పాటలు, ఆటలు.. డీజే మోతలు.. హంగామా..! ఇవన్నీ కామాన్ గా మారాయి. గల్లీ గల్లీకో గణపతి .. సందు సందుకో మండపం. రోడ్లు ప్యాక్. భక్తి ముసుగులో కొందరు చేసే పిచ్చి, అల్లరి చేష్టలు విసుగుతెప్పిస్తాయి. ఇలాంటి వారినుద్దేశించి అవధాని గరికిపాటి నర్సింహారావు విసిరిన ఛలోక్తులు నిజాలను నిష్టూరంగానే చెప్పాయి. కానీ వినేదెవ్వరు?