చెల్లె ప్రాణాల‌రిచేతిలో పెట్టుకుని వైద్యం కోసం గిలాగిలా కొట్టుకుంటున్న‌ది. అటువైపు అంబులెన్స్.. ఇటువైపు వీళ్లు. మ‌ధ్య‌లో వాగు ఉధృతంగా పారుతున్న‌ది. ఏం చేయాలో తెలియ‌డం లేదు ఆ అన్న‌లిద్ద‌రికీ. చెల్లె కొట్టుకుంటున్న తీరు ఆ గుండెల‌ను ద్ర‌వింప‌జేస్తున్న‌ది. ఇంక వేరే దారిలో లేదు. చెల్లెను భుజానికేసుకొని వాగులోకి దిగారిద్ద‌రు. వెనుక వారి త‌ల్లి. అలా ఆ వాగును దాటారంతా ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం.. చెన్నూరు మండ‌ల కేంద్రంలోని ఓ ప‌ల్లెలో ఇది జ‌రిగింది. బాల్క సుమ‌న్ ఎమ్మెల్యే. దీన్ని ఒక‌రు వీడియో తీశారు. డైన‌మిక్ లీడ‌ర్ బాల్క‌సుమ‌న్.. నువ్వు చేసిన అభివృద్ధి ఇదీ..!అని ఆ యువ‌కుడు నిల‌దీసిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

 

You missed