కరోనా కేసులు కేరళలో విపరీతంగా పెరుగుతున్నాయనే వార్తలు .. అందరినీ కలరవపెడుతున్నాయి. అయితే ఇది మూడో వేవ్ కాదంటున్నారు వైద్యులు. పాత కేసులే ఇక్కడ పెరుగుతున్నాయని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొంత కేసుల సంఖ్య నెమ్మదించినట్టు కనిపిస్తుంటే.. కేరళలో మాత్రం విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ స్కూళ్లు తెరవాలని భావిస్తున్నారట. ఇదే ఇప్పుడు అందరినీ విస్మయానికి లోను చేస్తున్న అంశం. ఆంధ్రలో ఇటీవల స్కూళ్లు తెరిచారు. కొన్ని కేసులు కనిపించాయి. దీంతో తెలంగాణలోలకు తెరవాలా? వద్దా? అని మీమాంసలో ఉన్న ఇక్కడి సర్కార్.. ఎట్టకేలకు రిస్క్ తీసుకున్నది. నిన్నటి నుంచి పాఠశాలలు ప్రారంభమైనా.. ఎవరూ సరిగ్గా వెళ్లలేదు. ఆన్లైన్ పైనే ఎక్కువ మంది మక్కువ చూపారు. తల్లిదండ్రులూ భయపడుతున్నారు పాఠశాలలకు పంపాలంటే. కేరళ మాత్రం రిస్క్ తీసుకుంటున్నది. విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకొని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ నివేదిక… విద్యాశాఖ నివేదికల్ని ముఖ్యమంత్రికి ఇవ్వనుంది. ఈ నివేదికల సూచనల మేరకు ముఖ్యమంత్రితో చర్చించి.. పాఠశాలలను పున:ప్రారంభించాలా..? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నట్లు అక్కడి విద్యాశాఖామంత్రి గురువారం తెలిపాడు. అయితే స్కూల్స్‌ను తిరిగి తెరవవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారని స్పష్టం చేశాడు. ఇక సీఎం నిర్ణయమే ఇక్కడ తరువాయిగా ఉంది.
గందరగోళ చదువులు.. క్లారిటీ లేని నిర్ణయాలు… https://vastavam.in/2021/08/31/state-news/p=1677/
20వేల ప్రైవేటు స్కూళ్లు మూత పడ్డాయి.. https://vastavam.in/2021/08/24/state-news/p=1423/