(దండుగుల శ్రీనివాస్)
ఈట్ కా జవాబ్ పత్తర్ సే… ఈ నానుడి మనం తరుచు వినే ఉంటాం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక మాటంటే నేను పదిమాటలంటా అని దానికి దిమ్మదిరిగే కౌంటర్లు నేతలు కాదు.. వారియర్లు విసురుతున్నారు. కేటీఆర్ అన్నాడు కదా.. తన తండ్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా. కేసీఆర్ శిఖరం.. రేవంత్ శునకం..అని. దీనికి కాంగ్రెస్ టిట్ ఫర్ టాట్ సమాధానమిచ్చి తిక్క కుదిర్చే పని చేసింది.
దీనికి మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా తీసుకుని… ఆ రిజల్ట్ కేంద్రంగా విమర్శలు గుప్పించింది. చూశావా మా ఫలితాలు శిఖరమంత ఎత్తులో. మరి మీవి.. పాతాళంలో లోతుల్లోకి ఎలా పడిపోయాయో…! అని. మనకు మనం శిఖరం.. శునకం అంటే సరిపోదు కేటీఆర్ .. జనాలు ఇచ్చే తీర్పు ఆధారం చేసుకోవాలిగా. ఇవిగో ఆధారాలు, ఫలితాలు… ప్రజా తీర్పు అని వాటిని ముందుంచారు. అందుకే నోరు జారనేలా..మాటలు పడనేలా? అనేది. ముందే పరిస్థితులు అంతంత మాత్రం. కాలం కలిసి రావడం లేదు. ఏదో మీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఏవో మాటలనే క్రమంలో పెద్ద పెద్ద పదాల ప్రయోగాలు చేస్తే అవి ఇలాగే వికటిస్తాయి రామన్నా!

Dandugula Srinivas
Senior Journalist
7661066999
