(దండుగుల శ్రీ‌నివాస్‌- వాస్త‌వం)

కూర‌గాయ‌ల ఉమ‌రాణి. ఇప్పుడు కాబోయే మేయ‌ర్‌గా ఆమె పేరు ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. న‌గ‌రంలోని 49 వ డివిజ‌న్ కసాబ్‌గ‌ల్లీలో ఆమెది మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబం. మాములు సొంత ఇల్లు ఉన్నా.. కుటుంబ భారాన్ని త‌నూ మోసింది. టైల‌రింగ్ చేస్తూ ఆ వ‌చ్చే ఆదాయంతోనే ఆమె కుటుంబానికి ఆస‌రాగా నిలిచేది. చాలా కాలంగా ఆమె కుట్టుప‌ని చేయ‌డంతో ఆ చుట్టుప‌క్క‌ల గిరాకీ ఆమెకు వ‌చ్చేది. ఉమారాణికి న‌లుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు. ఒక అబ్బాయి. క‌ష్ట‌ప‌డి పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్న ర‌మేశ్ ఉమారాణి దంప‌తులు.. పెద్ద‌మ్మాయిని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబంలో ఎన్నో క‌ష్టాలు ప‌డి సంసారాన్ని నెట్టుకొచ్చిన ఉమారాణి దంప‌తుల‌కు మేయ‌ర్‌గా అదృష్టం వ‌రించింది.

ఇప్పుడామె న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరురాలు. అంత‌కు ముందు న‌గ‌ర మేయ‌ర్‌గా ఉన్న ఆకుల సుజాత .. మేయ‌ర్ అయ్యేనాటికి బీడీలు చుట్ట‌డ‌మే వృత్తిగా కొన‌సాగించేవారు. ఇప్పుడు ఉమారాణి కుట్టుమిష‌న్ ప‌ని నుంచి ఏకంగా కార్పొరేట‌ర్‌.. ఆ వెంట‌నే మేయ‌ర్ పీఠంపై కూర్చునే అదృష్టం వ‌రించింది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999