(దండుగుల శ్రీ‌నివాస్‌)

ముదిరాజుల‌కు కాలం క‌లిసివ‌చ్చింది. అనూహ్యంగా మేయ‌ర్ పీఠం ఎక్క‌బోతున్నారు 49వ డివిజ‌న్ నుంచి కార్పొరేట‌ర్‌గా ఎన్నికైన ర‌మేశ్ ఉమారాణి. దాదాపుగా ఆమె పేరునే కాంగ్రెస్ అధిష్టానం ఖ‌రారు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. జ‌న‌ర‌ల్ ఉమ‌న్‌గా రిజ‌ర్వేష‌న్ వ‌చ్చినా.. కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి కాట్ప‌ల్లి శ‌మంతాన‌రేంద‌ర్‌రెడ్డి ఓడిపోవ‌డంతో… ఎవ‌రిని మేయ‌ర్ చేయాల‌నేదిపై అధిష్టానం సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేసింది. రెడ్ల నుంచి ఎవ‌రూ లేక‌పోవ‌డంతో బీసీల‌లో మ‌హిళా కార్పొరేట‌ర్ల పేర్ల‌ను ప‌రిశీలించింది.

మున్నూరుకాపు, ముదిరాజు, గౌడ కులాల‌కు చెందిన కార్పొరేట‌ర్ల పేర్ల‌ను ప‌రిశీలించారు. పంచ‌రెడ్డి చ‌ర‌ణ్‌, పూజిత ప్ర‌వీణ్ గౌడ్‌, కూర‌గాయ‌ల ర‌మేశ్ ముదిరాజ్‌.. ఈ ముగ్గురి అభ్య‌ర్థిత్వాన్ని అధిష్టానం సీరియ‌స్‌గా ప‌రిశీలించింది. చివ‌ర‌గా ముదిరాజుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. రాజ‌కీయంగా బాగా వెనుక‌బాటుకు గురై ఉన్న ఈ సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీట వేసిన‌ట్ట‌వుతుందని అధిష్టానం భావిస్తోంది. దీంతో కూర‌గాయ‌ల ర‌మేశ్‌కు ఈ వ‌రం వ‌రించింది.

మేయ‌ర్ పీఠంపై ఉమారాణి ఆసీనురాలు కానున్నారు. సోమ‌వారం ఉద‌యం ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం, మేయ‌ర్ ఎన్నిక‌లో అంతా క‌లిసి ఆమె పేరును బ‌ల‌ప‌ర్చ‌నున్నారు. డిప్యూటీ మేయ‌ర్‌గా ష‌రా మామూలుగా ఎంఐఎం నుంచి ఒక‌రిని ఎన్నుకున్నారు. మొత్తం కాంగ్రెస్, ఎంఐఎం, ఒక బీఆరెస్ క‌లిపి 32గా కాంగ్రెస్ బ‌లం పెరిగింది. దీంతో మేయ‌ర్ ఎన్నిక లాంఛ‌న‌మే కానుంది. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ మేయ‌ర్ ఎన్నిక మొద‌లు అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999