(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ చ‌ర్చ జ‌రుగుతోంది. అది నిజామాబాద్ మేయ‌ర్ సీటుపై. కాంగ్రెస్ నుంచి మేయ‌ర్ క్యాండిడేట్‌గా పోటీ చేసిన కాట్ప‌ల్లి శ‌మంతా న‌రేంద‌ర్‌రెడ్డి ఓట‌మిపై. ఆ పార్టీ ఈ ఓట‌మిపై లోతుగా వివ‌రాలు తెలుసుకుంటుంటే.. కార‌ణాలు తోడుతుంటుంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. శ‌మంతాన‌రేంద‌ర్‌రెడ్డి 19వ డివిజ‌న్ నుంచి పోటీ చేశారు. ఇక్క‌డే ఈ డివిజ‌న్‌లో డీసీసీ అధ్య‌క్షుడు న‌గేశ్‌రెడ్డి కూడా నివాసం ఉంటున్నాడు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో న‌గేశ్‌రెడ్డి ఇంటి ప‌రిస‌రాల ప్రాంతాల్లో ఉన్న రెండు వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓట్లు స‌రిగ్గా రాలేదు. రెడ్ల ఓట్లు చాలా మైన‌స్ అయ్యాయి. కార‌ణం ఎవ‌రా అని ఆరా తీస్తే.. దీని వెనుక డీసీసీ ప్రెసిడెంట్ ముక్కోపిత‌నం ఒక‌టైతే.. అంద‌రినీ క‌లుపుకుని పోలేక‌పోవ‌డం.. అంత‌కు మించి న‌రేంద‌ర్‌రెడ్డి గెలువ‌డం ఆయ‌న‌కు ఏమ‌త్రం ఇష్టం లేన‌ట్టుగా అంటీముట్ట‌న‌ట్టు ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న అంతా ఒక్కొక్క‌టిగా బ‌య‌డ‌పడిదంట‌. దీంతో ఇదే అంశం ఇప్పుడు ఇందూరు కాంగ్రెస్‌లో తీవ్ర చ‌ర్చ‌కు తెర తీసింది.

మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు, న‌రేంద‌ర్‌రెడ్డికి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మ‌హేశ్‌కుమార్ రెడ్డి ప‌ర‌ప‌తిని త‌గ్గించాల‌నే ఓ కుట్ర కోణం కూడా న‌రేంద‌ర్ రెడ్డి ఓట‌మిలో కీల‌కంగా ఉంద‌నే విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. మేయ‌ర్ క్యాండిడేట్‌నే గెలిపించుకోలేక‌పోయార‌నే ఓ అప‌వాదు మ‌హేశ్‌కు అంట‌గ‌ట్ట‌డంతో పాటు న‌రేంద‌ర్‌రెడ్డిన మేయ‌ర్ కాకుండా చేయాల‌నే దురాలోచ‌న‌, క‌సి కూడా న‌గేశ్‌రెడ్డి అండ్ టీమ్ చేసి ఉంటుంద‌నే భావ‌న‌కు వ‌చ్చింది ఇందూరు కాంగ్రెస్‌. అంటే కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కున్న చందంగా డీసీసీ.. న‌రేంద‌ర్‌రెడ్డి ఓట‌మిలో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కార‌కుడ‌య్యాడ‌నే ఆరోప‌ణ‌లు చుట్టుముట్టాయ‌త‌డిని ఇప్పుడు.

మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న న‌గేశ్‌రెడ్డి… వీరిద్ద‌రు క‌లిసి పీసీసీ చీఫ్ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లించే ఉద్దేశ్యంతోనే ఇది జ‌రిగిందా? అనే కోణంలో కూడా కాంగ్రెస్ పెద్ద‌లు ఆరా తీస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో కూడా ప‌లువురితో డీసీసీ తిక్క‌గా, కోపంగా మాట్లాడిన తీరు, వ్య‌వ‌హారం.. వారిని బీజేపీలోకి పోయేలా చేశాయ‌ని, దీని వ‌ల్ల కాంగ్రెస్‌కు రావాల్సిన రెడ్ల ఓట్లు.. బీజేపీ ఖాతాలో ప‌డ్డాయ‌నే లెక్క‌లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మొత్తంగా ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్నట్టుగా న‌రేంద‌ర్‌రెడ్డిని ఓడించి మేయ‌ర్ కాకుండా చేయ‌డం, మ‌హేశ్‌కుమార్ గౌడ్ ప‌ర‌ప‌తిని దెబ్బ‌తీయ‌డం… ఈ రెండు ప్ర‌ధాన అస్త్రాలుగా ఈ ప్ర‌యోగాలు చేసిన‌ట్టు తెలిసింది.

కానీ.. వార‌నుకున్న న‌రేంద‌ర్‌రెడ్డి ఓట‌మి జ‌రిగింది కానీ, కాంగ్రెస్‌కు మేయ‌ర్ సీటు రాకుండా మాత్రం చేయ‌లేక‌పోయారు. అయితే న‌రేంద‌ర్‌రెడ్డి సునాయ‌సంగా గెలిచే 19 వ డివిజ‌న్‌లో.. డీసీసీ ప్రెసిడెంట్ ద‌గ్గ‌రుండీ మ‌రీ ఓట‌మి పాలు చేయ‌డాన్ని అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. దీనిపై లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌నే వాద‌న‌లు ఇందూరు కాంగ్రెస్‌లో ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999