(దండగుల శ్రీనివాస్)
క్యాండిడేట్ మీద ఉన్న అసంతృప్తి, కోపం… రెడ్లకు వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకునేలా చేసింది. మేయర్‌గా వచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నది వాళ్లే. ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో.. మన ప్రాతినిథ్యం లేకుండా పోయిందే అని తపన పడుతున్నారు. ఎట్లైనా నరేందర్‌రెడ్డిని ఓడించాలె అనుకున్నారు తప్పితే.. అసలుకే మోసం వస్తుందని కనీసం ఊహించలేకపోయింది ఆ రెడ్డి సమాజం. ఇప్పుడు ఇందూరు రెడ్లలో జరుగుతున్న చర్చ ఇదే. కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థిగా కాట్పల్లి శమంతా నరేందర్‌రెడ్డిని నిలబెట్టింది అధిష్టానం. ఖర్చుకు వెనకాడనకుండా నరేందర్‌రెడ్డి తన ఎఫెర్ట్స్ అన్నీ పెట్టాడు.
తన సామాజిక వర్గం కూడా తనకు తోడుగా నిలుస్తుందని భావించాడు. అందరినీ కలిశాడు. కానీ కొందరిని కలవలేకపోయాడు. అంతా ఓకే ఓకే అన్నారు. కానీ దెబ్బ కొట్టేదాక తెలియలేదు నరేందర్‌రెడ్డికి. ఘోరంగా ఓడించారంతా. కాంగ్రెస్‌కూ ఇది కష్టకాలంగానే పరిణమించింది. ఓసీ మహిళా అభ్యర్థే ఆ పార్టీలో లేకుండా పోయింది. అంతరెడ్డి రాజరెడ్డి కోడలు పోటీ చేసినా.. ఆమే ఓడిపోయింది. దీంతో ఈ మేయర్ పీఠాన్ని బీసీ మహిళకే కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేక లేక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామా అని ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టుకుని ఏడుస్తున్నారీ సామాజిక వర్గ పెద్దలు. అయితే బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి రెడీగా ఉన్నది. గెలిచింది కూడా.
కానీ చాన్స్ రాలేదు మేయర్ పీఠం ఎక్కేందుకు. ఇప్పుడు ఈ రెడ్డి సామాజికవర్గమంతా అయ్యో… ఇక్కడ మనోడు పాయె… అవతల ఆమేకూ చాన్స్ రాకపాయె.. వచ్చిన చాన్స్‌ను చేజేతులా పోగొట్టుకున్నాం… కదా ఎప్పుడు మళ్లీ చాన్స్ వచ్చేది.? ఇప్పటికే రెడ్లకు రాజకీయంగా ప్రాతినిథ్యం తగ్గుతూ వస్తుంటే.. మనకు మనమే ఈ దుస్థితి తెచ్చుకున్నాం ఏందీ? అని ఆవేదన చెందుతున్నారట. దీన్నే అంటారు కాబోలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే. ఇప్పుడు ఏం చేసినా పరిస్థితి చేయి దాటింది. బీసీ మహిళా కార్పొరేటర్ ఇందూరు మేయర్ కాబోతున్నారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
