(దండుగుల శ్రీ‌నివాస్)

నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ కు ఇదో త‌ల‌నొప్పి వార్త‌. ఆయ‌నకు సంబంధించిన కిసాన్ క్లాత్ షోరూంకు చెందిన గోదాంలో దెయ్యం తిరుగుతుంద‌ట‌. ప‌దిహేను రోజులుగా. ఇది నేన‌డం లేదు బాబు.. స్వ‌యంగా ఆ గోదాం సిబ్బందే సీసీ కెమెరాలో గుర్తించార‌ట‌. కుర్చీలో కూర్చున్న ఓ ఆకారం తెల్ల‌టి జుట్టుతో ముఖం క‌నిపించ‌కుండా రూపం పూర్తిగా లేకుండా ఏదో మొత్తానికి దెయ్యాన్ని త‌ల‌పించేలా ఉందంట‌. దీంతో వీరు క‌న్ఫాం చేసేసుకున్నారు. ఆ బ‌ట్ట‌ల దుకాణం గోదాంలో దెయ్యం తిర‌గాడుతుంద‌ని. ఆ గోదాం నిర్మించిన స్థ‌లంలో గ‌తంలో స్మ‌శాన వాటిక కూడా ఉండ‌టంతో వీరి అనుమానానికి అది మ‌రింత బ‌లాన్ని చేకూర్చిన‌ట్ట‌య్యింది.

దీంతో ఆ నోటా ఈ నోటా ఈ విష‌యంలో అందులో ప‌నిచేసే సిబ్బంది అంద‌రికీ తెలిసిపోయింది. వారంతా బిక్కుబిక్కు మంటూ ప‌ని చేసుకుంటున్నారు. దీంతో వారిలో భ‌యం పోగొట్ట‌డానికి ఆ యాజ‌మాన్యం నిత్యం రెండు సార్లు హ‌నుమాన్ పారాయాణం, చాలీసాను ఆడియో ద్వారా అక్క‌డ ప్లే చేస్తూ ప‌నిచేసుకుంటున్నార‌ట‌. ఇదీ ప‌దిహేను రోజులుగా అక్క‌డ జ‌రుగుతున్న తంతు. కాస్తా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వాస్త‌వం డిజిట‌ల్‌మీడియా దీన్ని బయ‌ట‌కు తీసింది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999