వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ లో తాజాగా జరిగిన గౌడ,గీతా వృత్తిదారులపై ఓ మీడియా రిపోర్టర్ పై వీడీసీలు చేసిన దాడి విచారకరం, బాధాకరమని దాడికి పాల్పడిన వీడీసీ బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) జిల్లా కన్వీనర్ కోయెడి నర్సింలు గౌడ్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరారు.
గత అనేక నెలలుగా నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ,గీతవృత్తి దారులపై వివిధ బీసీ, దళిత వర్గాలపై వీడిసిల దౌర్జన్యాలు, ఆగడాలు పెరుగుతున్నాయన్నారు. బహిష్కరణలు, జరిమానాలతో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ అధికారులు, అధికార కాంగ్రెస్ , బీఆరెస్, బీజేపీ పార్టీల నాయకులు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.
