ధన్‌పాల్ గోదాంలో దయ్యం! కిసాన్ క్లాత్ షోరూం గోదాంలో దెయ్యం తిరుగుతుందంట! పదిహేను రోజులుగా భయం భయంగా పని చేసుకుంటున్న సిబ్బంది.. నిత్యం హనుమాన్ చాలీసా ఆడియో ప్లే చేస్తూ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం..
(దండుగుల శ్రీనివాస్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కు ఇదో తలనొప్పి వార్త. ఆయనకు సంబంధించిన కిసాన్ క్లాత్ షోరూంకు చెందిన గోదాంలో దెయ్యం తిరుగుతుందట. పదిహేను రోజులుగా. ఇది నేనడం లేదు బాబు.. స్వయంగా ఆ గోదాం సిబ్బందే…
