(దండుగుల శ్రీనివాస్)
లోకేశ్ కనగరాజ్. డైరెక్టర్‌గా తనకంటూ ఆనతికాలంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. ఖైదీతో తన సత్తా చాటాడు. తన అభిమాన నటుడు కమల్‌తో విక్రమ్ తీసి ఇక తిరుగులేదనిపించుకున్నాడు. అతని నేపథ్యం.. చాలా పేదరికం నుంచి వచ్చిందే. అతని తండ్రి ఓ బస్ కండక్టర్. సూపర్ స్టార్ రజినీ .. అతని ఖైదీ సినిమా చూసి ఫిదా అయిపోయాడట. పిలిచి మరీ ఏదైనా కథ చెప్పవయ్యా.. సినిమా తీద్దాం అని కూడా అడుగాడట. కానీ తనే తాత్సారం చేశాడు. ఇదిగో ఇప్పటికిలా కూలీ రూపంలో ఇద్దరికీ కుదిరించి. భారీ అంచనాలతో అది రిలీజయ్యింది. నెగిటెవ్ టాక్ మూటగట్టుకున్నా.. సినిమా వసూళ్ల విషయంలో మాత్రం నష్టాల్లో ఉండదనేది స్పష్టం.
ఇక మనం పైన చెప్పుకున్నట్టు.. లోకేశ్ తండ్రి ఓ బస్ కండక్టర్. అతని ఎంప్లాయి ఐడీ నెంబర్ 5821, కూలీ సినిమాలో రజినీ ఓ కూలీ. కూలీల నాయకుడు. అతని కూలీ నెంబర్ 5821. తన తండ్రిని స్మరించుకుంటూ ఈ నెంబర్‌ను రజినీకి ఇచ్చానని తనే చెప్పుకున్నాడు వేదిక మీద లోకేశ్. అంతకు ముందు సూపర్ స్టార్ కూడా ఓ బస్ కండక్టరే. ఓ బస్ కండక్టర్ కొడుకు.. మరో బస్ కండక్టర్‌తో పాన్ ఇండియా సినిమా తీశాడు.

Dandugula Srinivas
Senior Journalist
8096677451
