(దండుగుల శ్రీనివాస్)
ఎంతో రిస్క్ తీసుకుని చేశాడనుకున్నారు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడని గంపెడాశలు పెట్టుకున్నారు. లోకేశ్ డైరెక్షన్‌లో తమ అభిమాన నటుడి విలనిజాన్ని ఆకాశానికెత్తేలా చూపుతాడని భ్రమ పడ్డారు. నాగ్ అన్నట్టుగా… లోకేశ్ విలన్ పాత్రలను కూడా అద్బుతంగా చిత్రీకరిస్తారని, విక్రమ్ సినిమాలో విజయ్ సేతుసతి పాత్రనే తనకు ఆదర్శంగా ఉందని అన్నాడు. కానీ ఇక్కడ అంత సీన్ లేదు నాగ్‌కు. కూలీలో ఆయన విలనిజం పాత్ర చాలా నేరుబారు పాత్రే. మంచి మంచి కాస్ట్యూమ్స్ తొడిగితే సరిపోదు.. ఆ పాత్రకు తగ్గట్టు సీరియస్ నెస్ లేదు. హీరోతో సరి సమానంగా పోటీ పడే పాత్ర కాదు. కథ కూడా రజినీ చుట్టూ తిప్పుకుని.. ఆయన్ను ఎట్లా ఆకాశానికెత్తాలా అని చూసే విధంగా లోకేశ్ రాసుకున్న కథనంలో పడి బుగ్గి అయ్యాడు నాగార్జున. నిజంగా చెప్పాలంటే నాగ్ చాలా డేర్ చేశాడు. రజినీ అన్నట్టుగా.. అతనికి డబ్బులకు కొదవ లేదు… పనికి మాలిన.. అడ్డమైన బిగ్ బాస్ షోలు కూడా వదలడం లేదు నాగ్.
అతనికి పైసల పరేషాన్ లేదు. డైరెక్టర్ సత్తువ పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాగైనా తనకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అనుకున్నాడు. మూస దోరణి కాకుండా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన బాగానే ఉంది. కానీ … ఆ పాత్ర మలిచిన తీరు చాలా ఘోరం. అసలు నాగార్జున విలనిజం ఎక్కడా ఎలివేట్ కాలేదు. ఓ పావులా వాడుకున్నాడు డైరెక్టర్. ఓ రకంగా చెప్పాలంటే రజినీ ఇమేజ్ ముందు నాగ్‌ను దిష్టిబొమ్మనే చేశాడు. తమ అభిమాని కొత్తవతారం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా జనం థియేటర్లకు వచ్చారు. కానీ చాలా డిసప్పాయింట్ చేశాడు నాగ్. డైరెక్టర్ లోకేశ్ నాగ్ అభిమానులను మోసం చేశాడు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451