వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
సిటీలో తాగి బండి నడపాలంటే ఉచ్చపడతది. కానీ పోలీసులు చెక్ చేసేది ఏ రాత్రికో. అదే ఇప్పుడు అలుసుగా మారింది. ఎంతలా అంటే పరిగడపునే, పాచినోటినే కానిచ్చేస్తున్నారు. తప్పతాగేస్తున్నారు.మమ్మల్ని ఆపేదెవడు..? అని రయ్యు రయ్యున సిటీ రోడ్ల మీద తాగి .. వాహనాలను తైతక్కలాడుతున్నారు. వారు వీరు అని కాదు. ఇందులో ఏకంగా స్కూల్ బస్సు డ్రైవర్లే ఉండటం దారుణం.
ఈ విషయం తెలిసి పోలీసులు నోరెళ్లబెట్టారు. అవాక్కై ఔరా ఇదెక్కడి దారుణమని ముక్కుమీద వేలేసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఒకే రోజు 25 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు అదే రూట్‌లో దొరికిపోయారట. అంటే సిటీలో ఇంకెన్ని బస్సులున్నయి.. ఎంత మంది తాగి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో…? స్కూల్ బస్సు నడుపుతున్నాం.. కదా మమ్మల్ని సాఫ్ట్ అనుకోవద్దు.. లోపల ఒరిజినల్ అట్లనే ఉన్నదని నిరూపించారీ డ్రైవర్లు. దీంతో అలర్టయిన సిటీ పోలీస్ ఇకపై డే టైంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తారట. చచ్చింది గొర్రె.