(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆస్తుల పంప‌కాల్లో వాటా కోసం పోటీ, పార్టీ ఫండ్ ఒక్క‌డికేనా.. నా వాటా ఏద‌ని పోటీ.. పార్టీలో ఒక్క‌డికేనా నాకేదీ మ‌ర్యాద‌ని పోటీ…! ప‌ద‌వులు, అధికారం ఒక్క కొడుకుకేనా.. బిడ్డెకుండ‌దా అని పోటీ..! ఇప్పుడు నువ్వొక్క‌డివే తిట్టి ఫేమ‌స్ అవుతావా.. నేనూ ఏం త‌క్కువ తిన‌లేదు.. నేనూ తిడ‌తాన‌ని పోటీ..! ఇలా పోటాపోటీ పోటీ కొన‌సాగుతోంది అన్నాచెల్లెళ్ల మ‌ధ్య‌. ఇప్పుడు చెప్పే విష‌యం ఏంటంటే… కవిత కూడా ఇప్పుడు సీఎంను తిట్టే రేసు పోటీ పెట్టుకుంది అన్న‌కు ధీటుగా. అవును ఆమె నోటి వెంట సీఎం రేవంత్‌పై ఘాటు ప‌దాలే వెలువ‌డుతున్నాయి.

మామూలుగా మాట్లాడితే తాను అన్న‌తో పెట్టుకున్న పొలిటిక‌ల్ రేసులో వెనుక‌బ‌డి పోతాన‌నుకున్న‌దో ఏమో..! పదాలు అంత ప‌రుషంగా లేక‌పోయినా.. అన్న‌లా మ‌రీ దిగ‌జారి కాక‌పోయినా.. కొంచెం హుందాత‌నం జోడించిన‌ట్టే జోడించి .. ఇంకొంచెం ఘాటు పెంచి వాగ్ధాటితో ప్ర‌సంగించి అందులో రేవంత్‌న్ ఘాట్టిగా అర్సుకుని వ‌దిలేస్తున్న‌ది. అస‌మ‌ర్థ సీఎం అన్న‌ది. బ‌ల‌హీనం సీఎం అని కూడా అన్న‌ది. ఇంత‌టి బ‌ల‌హీన సీఎంను ఎప్పుడూ చూడ‌లేద‌ని గ‌ట్టిగానే తిట్టింది.

అంతే కాదు.. పిట్ట‌ల‌దొర అని కేసీఆర్ తిట్టేవాడు గుర్తుందా..? అదేనండీ స‌మైక్య రాష్ట్రంలో చివ‌రి సీఎం.. న‌ల్లారి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. ఆ … ఆ సీఎం కూడా బాగానే న‌చ్చాడ‌ట క‌విత‌కు. కానీ అంత‌క‌న్నా ఘోర‌మ‌ట ఇప్పుడు సీఎం రేవంతు. ఇలా సాగింది ఆమె స్పీచు. ఇక రాహుల్ ద‌ర్శ‌న‌మే లేదు. ఫోటో కూడా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. బయ‌ట పెట్టిన ఫోటోలో త‌ను లేడు.. అని … మ‌ళ్లీ ఆయ‌న ద‌ర్శ‌న గోల మ‌న‌కెందుకు అని ఎట‌కార‌మాడిన‌ట్టు సాగిందా స్పీచు.

ఇక మొన్న‌టికి మొన్నైతే కేటీఆర్ కంట్రోలే త‌ప్పాడు. అరే హౌలే, నీ అంత చిల్ల‌ర‌గాడుండ‌డు. వెంట్రుక కూడా పీక్కోలేవు. వాడు వీడు.. అరేయ్ తురేయ్‌.. .ఇలా సాగిందాయ‌న వాగ్దాటి.

You missed