(దండుగుల శ్రీనివాస్)
బోధన్‌కు ఉప ఎన్నిక తప్పేలా లేదు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి రాజీనామా చేయబోతున్నాడు. తనకు మంత్రి పదవి దక్కదని తేలిపోయింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం తనను తీవ్రంగా అవమానించడమేనని భావిస్తున్నాడాయన. అందుకే రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా మీనాక్షి నటరాజన్‌తో కూడా చెప్పేశాడు. చిల్లర రాజకీయాలు చేయడం అలవాటు లేదు.
లోకల్ లీడర్లతో రాజీనామాలు చేయించి.. నిరసనలు చేయించి.. ఢిల్లీ లెవల్లో లాబీయింగ్ చేయించే మనస్తత్వమూ కాదు. ఒకటే మాట. ఇస్తారా..? ఇయ్యరా..? ఇయ్యకపోతే అంతే. ఇచ్చేంత సీన్ అక్కడ కనిపించడం లేదు. అందుకే ఏకైక మార్గం. ఎంచుకున్న దారి. రాజీనామానే దిక్కు. అంతకు మించి తన ఆత్మగౌరవానికి దక్కే గౌరవం లేదని ఆ పెద్దాయన భావిస్తున్నాడు. సీఎం దగ్గరి బంధువైతేందీ..? ఆయన మాట చెల్లుబాటు కానప్పుడు, తనను కాపాడుకోలేనప్పుడు.. తనకిక ఎవరితో అవసరం లేదు. నత్తింగ్ డూయింగ్.
రాజీనామా చేసుడే. అందుకే అంటున్నా.. బోధన్‌కు త్వరలో ఉప ఎన్నిక తథ్యం. చచ్చిపోయిన బీఆరెస్ లేస్తుందా..? ఆనవాళ్లు లేని బీజేపీ నిద్ర మేల్కొంటుందా..? అది వారిష్టం. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం సుదర్శన్‌రెడ్డి పోటీ చేయబోవడం లేదు. ఎవరో తేల్చుకోండి. బోధన్ బరిలో నిలబడి గెలిచే కాంగ్రెస్ యోధుల్లారా..! పెద్దాయన మీకో మంచి అవకాశం ఇస్తున్నాడు..!