(దండుగుల శ్రీనివాస్)
వాటే విజన్.. వాటే థాట్… పిచ్చోళ్లైపోయారు మన టీమంతా..! ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో అందరికీ తెలుసు. ఇప్పుడిదెందుకు..? ఈ డైలాగ్ కరెక్టుగా కవితకు సరిపోతుంది. తను ప్రస్తుతం నడుస్తున్నతీరుకు, నడిపిస్తున్న కథనానికి నప్పుతుంది. అవును..! ఆమె అందరినీ పిచ్చోళ్లను చేస్తున్నది. ప్రత్యేకించి బీఆరెస్ టీమ్‌ను. కవిత టీమ్‌కు కొంత క్లారిటీ వచ్చింది. ఆమెకూ మాంచి క్లారిటీ ఉంది. కానీ ఈ ఎపిసోడ్ కాంతకాలం లాగించాలి.
ఎవరికి దొరకొద్దు. చికొద్దు. అందుకే ఆమె లేఖ బయటకు వచ్చిన తరువాత మాట్లాడే తీరు, చేస్తున్న కామెంట్లు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. పార్టీ పెడుతుందా..? అంటే పెట్టేలానే ఉంది అని అనిపించేలోపు.. పార్టీ పెట్టి ఏం లాభం.. ఉన్న పార్టీని కాపాడుకోవాలి కదా అని చెప్పేసింది. కాంగ్రెస్‌లోకి వెళ్తుందా ..! అని రాసిన వార్తతో కొంత అనుమానంగా చూస్తే నేను వాళ్లతో టచ్‌లో ఉండి ఏళ్లు గడుస్తుందని క్లారిటీ ఇచ్చేసింది. దయ్యాలెవరో క్లారిటీ ఇచ్చేసింది. పార్టీ నుంచి నన్ను గెంటేయడం మీ తరం కాదనీ సవాల్ విసిరింది.
బీజేపీలో బీఆరెస్‌ను విలీనం చేయాలని ట్రై చేస్తున్నారని అన్నది… అస్సలే అర్థం కాలె ఈ ముచ్చట. ఎవరూ ప్రయత్నం చేశారు. కేసీయారా….? కేటీయారా..? కేసీఆర్ అయి వుండదు.. ఎందుకంటే ఆయన దేవుడు ఆమె దృష్టిలో. మరి కేటీయారా..? అబ్బబ్బ చెప్పొద్దు.. ఎన్ని అనుమానాలున్నాయో ఆమె మాటల్లో. నివృత్తి చేసే దమ్ము ఎవడికీ తెలియదు. ఎందుకంటే ఆమెకు తప్ప నిజాలు మరెవరికీ తెలిసుండవు. అక్క ఏం మాట్లాడుతుందో.. ఎటు పోతుందో..? ఏం చేస్తుందో..? నమ్ముకున్న మమ్మల్ని చివరాఖరుకు ఏం చేస్తదో … అర్థం కాక జాగృతి అన్నలు జుట్టు పీక్కుంటుంటే… బీఆరెస్ నేతలు మాత్రం.. కవిత ఇప్పుడు మన కాంపౌండ్‌లోని బిడ్డెనేనా..? ఇక మనం మర్యాద, గౌరవం ఇవ్వొచ్చునా..? విరుచుకుపడొచ్చునా..? తుక్కు తక్కు తిట్టొచ్చునా..? కేసీఆర్ బిడ్డే కదా.. జర వెనుకా ముందు చూసి మాట్లాడదామా..?
ఏమీ అర్థం కావడం లేదు. ఉపేంద్ర లిమాయో డైలాగ్ లాగా… వాటే విజన్, వాటే థాట్…
పిచ్చోళ్లైపోయారు మన టీమంతా…! ఇప్పటికింతే.. !