(దండుగుల శ్రీ‌నివాస్‌)

29Vastavam.in01
ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… అన్న‌ట్టుగానే సా..గుతోంది మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఇక అయిపోయింది .. రేపో మాపో అనుకున్నామా..? లేదు. అంత తొంద‌ర‌గా జ‌రిగేట‌ట్టు లేదు. మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. ఎందుకు..? ఎందుకంటే.. ఎందుకంటే.. ఖండిస్తున్న‌మంటే.. ఖండిస్తున్నం బై అని ఏదో సినిమాలో అన్న‌ట్టు. ఏదో రాసుకోవాలె.

కుల స‌మీక‌ర‌ణ‌లే అనుకోవాలె. ఇద్ద‌రు బీసీల‌కు ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌. ఇప్పుడున్న లిస్టులో వాకిటి శ్రీ‌హ‌రి ముదిరాజ్ ఉన్నాడు. ఇప్పుడు ఆది శ్రీ‌నివాస్‌, బీర్ల అయిల‌య్య పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. వీటిలో ఆది శ్రీ‌నివాస్‌పై ఎక్కువ మొగ్గు చూపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఎప్ప‌టి వ‌ర‌కు లెక్క తేలేనో తెలియ‌దు.