ఇందిరా పార్కు .. ఇది ఆహ్లాదాన్ని పంచే పార్కుగా కాదు. ప్రేమ జంటల కామకేళీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ విషయం హైదరాబాద్‌లోని సగానికిపైగా జనాభాకు తెలుసు. దీన్ని నివారించేందుకు చాలా సార్లు ప్రయోగాలు చేశారు. మధ్యలోనే చేతులెత్తేశారు. ఇక దీనికి అడ్డుఅదపు లేదు. యథేచ్చగా ఈ పార్కు ప్రేమజంటల సెక్స్ కోరికలు తీర్చుకునే వనంలా మారింది. ఎవరైనా తెలియని వారు పిల్లా జెల్లలతో వస్తే వాళ్లే సిగ్గుపడి కళ్లు మూసుకుని అవతలికి పారిపోవాలె తప్పితే .. ఇక్కడి వచ్చిన జంటలు మాత్రం ఎవరికీ జంకరు. వచ్చిన పని చూసుకుని, చేసుకొని పోతారు. అవునూ.. ఇప్పుడు ఇందిరా పార్కు లొల్లెందుకంటరా..?
ఈ పార్కుకు పెళ్లికాని జంటలు రావొద్దని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారట మేనేజ్‌మెంట్. దీనిపై పాపం ఎవరో విరహ ప్రేమికుడు స్పందించి. ఇదన్యాయం అని ట్వీట్ చేయడంతో మళ్లీ దాన్ని తొలగించారట. ఇదీ వార్త. విషయం చెప్పొచ్చేదేందంటే.. ప్రేమ జంటలు రావొద్దని ఎంత మందిని కంట్రోల్ చేస్తారు సారు. లోపల జరిగే కామకలాపాలను బ్రేక్ చేసేందుకు గట్టి నిఘా పెట్టండి. సీసీ కెమెరాలు పెట్టండి. సెక్యూరిటీ నియమించండి. సందు,గొందుల్లో, గుబురు పొదల్లో నిఘా పెట్టండి.. అంతేకానీ లోపలికి రాకుండ్రి.. వచ్చి మీరేం చేస్తారో మాకు తెలుసని మీకు మీరే డప్పు కొట్టుకోవడం ఎందుకు?