Dandugula Srinivas
ఐఏఎస్ అధికారి శరత్ సీఎం రేవంత్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశాడు. కేసీఆర్‌కు కాళ్లు మొక్కి బద్నాం అయిన కలెక్టర్లు.. అదే సంస్కృతిని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మొదలు పెట్టారు. శరత్ దీనికి నాంది పలికాడు. దీనిపై సీఎం రేవంత్ స్పందించినట్టున్నాడు. సీఎస్ రంగంలోకి దిగి ఇలాంటి చీప్ పనులు ఆపండని చురకవేశాడు. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పిదాలు ఇక్కడ జరగొద్దని ఎంతలా జాగ్రత్త పడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.
శరత్ కాళ్లు మొక్కుడేమో గానీ బీఆరెస్ సోషల్ మీడియా రెచ్చిపోయింది. అప్పుడు బాపులాంటి కేసీఆర్ కాళ్లకు దండం పెడితే తప్పైంది కానీ.. ఇప్పుడు రేవంత్‌కు పెడితే చప్పుడు చేయరా..? అంటు కయ్యున లేచారు. దీంతో ఇది పెద్ద డ్యామేజే అయి కూర్చుంటుందనే ఓ భయం.. దీన్ని మిగిలిన వాళ్లు కూడా ఫాలో అవుతారనే మరో టెన్షన్‌కు తెరవేస్తూ సీఎస్ చేత సీఎం ఈ విధంగా కట్టడి కామెంట్లు చేయించాడన్నమాట.