సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు, కొంత మంది టీఆరెస్ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ ఉద్యమ కారులను ఉరిక్కిచ్చి ఉరిక్కిచ్చి కొట్టాడనే విషయాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాంటి పోలీసు ఆఫీసరును తీసుకొచ్చి కీలకమైన సైబరాబాద్ సీపీగా ఎలా కూర్చోబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. కొంత మంది జోకుడుగాళ్లకు ఇది నచ్చుతుందేమో గానీ, దెబ్బలు తిన్నది వాళ్లు కాదు కదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రకు తీసుకుపోవాలని జగన్ భావించాడు. ఎట్టకేలకు ఆయనను సీఎం కేసీఆర్ ఇక్కడే కీలక పదవిలో కూర్చోబెట్టాడు. స్టీఫెన్ విషయంలో కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఇక్కడ టీఆరెస్ శ్రేణులు కొట్టుకుంటున్నారు గానీ.. కేసీఆర్ అవెప్పుడో మర్చిపోయాడు. పాపం వీరికే ఇంకా అర్థం కాక, అవగాహన లేక వీరిలో వీరే కొట్టుకుంటున్నారు. ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడే సిద్దాంతాలు మారాయి. ఉద్యమ పాఠాలు చెరిగిపోయాయి. ఉద్యమపార్టీ గుర్తు తొలిగిపోయింది. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడి, కేసీఆర్ను బండబూతులు తిట్టినోళ్లే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు. మరి స్టీఫెన్ ఎంత? అప్పుడు సీఎం చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఇప్పుడు ఈ సీఎం చెప్పినట్టుగా నడుచుకుంటాడు. అంతే…
