(దండుగుల శ్రీనివాస్)
దావతే ఇఫ్తార్… రంజాన్ తోఫా…! ఈ పేర్లతో పాలకులు ఆ మతాన్ని కించపరుస్తున్నారా..? ముస్లింలను గౌరవిస్తున్నాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం.. అని పాలకులు చెబుతున్నదంతా వారిని అవమానపర్చడంలో భాగమేనా..? ఏటా దీని కోసం వెచ్చిస్తున్న వందల కోట్లు అవినీతికి ఆలవాలంగా మారుతున్నాయా..? ఈ నిధులను దోచుకుంటున్నదెవరు..? రంజాన్ వేళ దీని వెనుక ఉన్న అవినీతి భాగోతం ఎంత మందికి తెలుసు…?
23Vastavam.in (3)
అసలు ఖురాన్ ఏం చెబుతోంది..? పాలకులు ఏం చేస్తున్నారు..? రంజాన్ వేళ పేదలకు మేం తోఫా ఇస్తున్నాం.. విఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నాం.. దీని కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం…. ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే. అవును.. ఆ ముస్లింలే మాకు ఇవి ఒద్దంటున్నారు. ఎవరిమన్నారు మీకు ..? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన దుస్థితిలో లేమంటున్నారు. అసలు ఖురాన్ బోధన, సిద్దాంతాలు ఇవి కాదు చెప్పేటివి.. మీరెందుకు వీటిని అతిక్రమిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. తాజాటా ఈ వివాదం చినికి చినికి గాలివాన అయినట్టుగా అంతటా చర్చ జరుగుతోంది. దీనికి కారకురాలు ముస్లిం మతానికే చెందిన కాంగ్రెస్ లీడర్ లుబ్నా సర్వత్.
ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ విధానంపై పోరాడుతున్నది. కేసీఆర్ దీనికి ఆద్యుడు. ఆయనే ఈ ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపాడు. దీనిపై పిల్ కూడా వేసింది సర్వత్. ఎటువంటి స్పందన లేదు ఇప్పటికీ. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చేస్తోంది. మజీద్‌లకు ఒక్కో లక్ష కేటాయించింది. ఎల్బీస్టేడియంలో దావత్ ఏర్పాటు చేసింది. మొత్తం 70 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులు మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల నుంచే. ప్రత్యేక నిధులేమీ కావు. అసలు కేటాయింపులే తక్కువ. అందులో కేటాయించినవి మొత్తం వినియోగం చేయడం అరుదు. అసాధ్యం. ఇక ఇందులో నుంచే కోట్ల రూపాయలు రంజాన్ పేరిట దుర్వినియోగం. అవినీతిమయం.
ఇందులో ఇంకో అసలు పాయింట్ దాగుంది. అందేంటంటే.. ఏ నిధులు మాకొద్దంటున్నారు ముస్లింలు. అవును. అది సీఎంఆర్ ఎఫ్ నుంచైనా సరే వద్దంటున్నారు. ఎమెర్జన్సీ ఫండ్ నిధులు మాకు వాడొద్దు. అసలు రంజాన్ పండుగకు నిధులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని సర్వత్ జరుపుతున్న పోరాటం, ప్రశ్నిస్తున్న గళం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నది. కేవలం ఇది ఓటు బ్యాంకు రాజకీయమేనని, ముస్లింలను ఈ విధంగా తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె వాదిస్తున్నది. ఈ కేటాయిస్తున్న నిధులన్నీ అవినీతికూపంలోకి వెళ్తున్నాయని కూడా ఆమె ఆరోపిస్తున్నది. ఈ కాంగ్రెస్ సర్కారైనా దీన్ని మానుకోవాలని ఆమె మళ్లీ గళం విప్పుతున్నది.