(దండుగుల శ్రీ‌నివాస్‌)

Dandugula Srinivas

8096677451

కీర్తి కండూతి. అధికార దాహం. పాల‌కుల ఈ రెండు వ్య‌స‌నాలు తెలంగాణ జ‌నాల‌ను బిచ్చ‌గాళ్ల‌ను చేశాయి. అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఆర్థిక మూలాల‌ను నాశ‌నం చేశాయి. పుట్ట‌గ‌తుల్లేకుండా చేస్తున్నాయి. ఆత్మ‌హ‌త్య‌లే త‌ప్ప వేరే మార్గం లేద‌నేలా ప‌రిస్థితులు క్రియేట్ చేసి పెట్టాయి. పాల‌కులు ఎవ‌రు…? ఆ ఇద్ద‌రు. ఆ ఇద్ద‌రెవ‌రు. ఒక‌రు కేసీఆర్. మ‌రొక‌రు రేవంత్‌రెడ్డి. అదేందీ… ? రేవంత్‌రెడ్డి ఏం చేశాడు. పాపం మొన్న‌నే కదా వ‌చ్చింది. ఏం చేయాలో పాలుపోక తెగ ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఏ వేదిక‌లెక్కినా క‌న్నీరు కారుస్తున్నాడు. ఆరు గ్యారెంటీలు అందించ‌లేక‌పోతున్నాన‌ని తెగ మ‌ద‌న ప‌డిపోతూ జ‌నాలకు వాస్త‌వాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇదే కదా మీర‌నేది. స‌రే ఆ టాపిక్ చ‌ర్చించుకుందాం.

ఇప్పుడు కేసీఆర్ గురించి ప్ర‌ధానంగా చెప్పుకోవాలి. కేసీఆర్‌కు కీర్తి ప‌తాకాలు అంటే వ్య‌స‌నం. జాతిపిత‌గా గుర్తించాల‌నే యావ‌. యావ‌త్ దేశ‌మంతా త‌న‌వైపు చూసి అబ్బుర‌పడాల‌నే విప‌రీత‌దోర‌ణి. దీనికంటే మించి… త‌నెక్క‌డ పాల‌న‌లో విఫ‌ల‌మైపోతాన‌నే భ‌యం. ఇవ‌న్నీ క‌లిసి ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప‌థ‌కాలు వ‌చ్చి ప‌డ్డాయి. వ‌ద్దాన్నా చేర్చారు. అడ‌గ‌నివీ వ‌చ్చి ప‌డ్గాయి. రాజ‌కీయ ప్ర‌స్థానం ప‌దిలం చేసుకోవ‌డం కోసం , దేశంలో చ‌క్రం తిప్పి ఏదేదో చేద్దామ‌నే దురాశ కోసం, నెల నెలా జీతాలు, పింఛ‌న్లు ఇవ్వ‌లేని దీన స్థితి క‌ళ్ల‌ముందే ఉన్నా.. కొత్త ప‌థ‌కాలు ఇచ్చే అతి విశ్వాస అరాచకం.. ఇవ‌న్నీ కేసీఆర్ చేసిన పాపాలు. ప‌ర్యావ‌సానంగా ల‌క్ష‌ల కోట్ల అప్పులు.

ఇవ‌న్నీ క్రియేట్ చేసి ఇక ఎవ‌డూ త‌న ద‌రికి రాకూడ‌దు. సీఎ0 అవుతాన‌నే క‌ల‌ల‌ను తుంగ‌లో తొక్కేసుకోవాలె… కేవలం కేసీఆర్ త‌ప్ప‌.. సీఎంగా ఇంకెవ‌డూ ప‌నికిరాడ‌ని జ‌నాలు బ‌లంగా ఫిక్స‌యిపోవాలె.. ఇదే ఆలోచ‌న కేసీఆర్‌ది. అందులో భాగంగానే ఇవ‌న్నీ చేసుకొచ్చాడు. కేసీఆర్ చెప్పును నిల‌బ‌డితే ఆ చెప్పును కూడా ప్ర‌జ‌లు గెలిపిస్తార‌నే దురంహంకారం నెత్తికెక్కిన వేళ‌. అంద‌రినీ మేపి మేపి మ‌ళ్లీ వారికే టికెట్లిచ్చి.. ఒక‌వేళ స‌రిప‌డా బ‌లం లేకున్నా.. మిత్ర ప‌క్షాల మ‌ద్ద‌తుతో మ‌ళ్లీ నేనే సీఎం.. ఆ త‌రువాత కొడుకును సీఎంగా ప్ర‌క‌టించేస్తా.. అనే ఏవేవో క‌ల‌లుగ‌న్నాడు గులాబీ జాతిపిత‌. కానీ రిజ‌ల్టు మ‌నం చూశాం. ఊహించ‌ని దెబ్బ‌. దీనికి ముందు రేవంత్ గురించి చెప్పుకోవాలె. అప్పులున్నాయ‌ని తెలుసు. జీతాలు స‌రిగ్గా టైమ్ కు ఇవ్వ‌డం లేద‌నీ తెలుసు. ఫించ‌న్లు నెలా రెండు నెల‌లు ఆపి మ‌రీ వేస్తున్నార‌నీ తెలుసు. కొత్త పింఛ‌న్ల జోలికి వెళ్లాలంటేనే పంచ త‌డుపుకుంటున్నార‌నీ తెలుసు. కాంట్రాక్ట‌ర్ల బిల్లులు ల‌క్ష‌ల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయ‌నీ తెలుసు. తెలుసు. తెలుసు. తెలుసు.

కానీ అంత‌కు మించి హామీలెందుకిచ్చాడు. ఎలాగైనా అధికారంలోకి రావాలె. ఎన్ని అబ‌ద్దాలైనా చెప్పాలె. కేసీఆర్ కాదు.. అంతుకు మించిన ఘ‌నుడు రేవంతు. పెంచే ఇస్తాం. తీసుకోండ‌ని ఆశ‌పెట్టాడు. అన్నీ ద‌రిద్రాలు క‌లిసి వ‌చ్చాయి కేసీఆర్‌కు. సిట్టింగుల అరాచ‌కాలు. అహంకార‌పూరిత ఫ్యామిలీ పాల‌న‌. నియంత‌కు త‌గ్గ‌కుంగా కేసీఆర్ ద‌ర్పం. అధికారం పిచ్చి ప‌చ్చ‌కామెర్లు క‌డుపులో ప‌డ్డ‌ట్టుగా ప‌డ్డాయి కేసీఆర్‌కు. అంద‌కే త‌న‌ను మించిన ఘ‌నుడు లేడనుకున్నాడు. క‌ర్రుకాల్చి వాత‌పెట్టారు జ‌నాలు. రేవంతును పీఠం ఎక్కించారు. ఇలా ఎక్కాడో లేదో… ఇక్క‌డ బంగారు లంకె బిందెలున్నాయ‌నుకున్నాం… అన్నీ అప్పులే. కేసీఆర్ అప్పుల మిత్తీల‌కే ల‌క్ష కోట్లు అప్పు తెచ్చాం. మాకు అప్పు ఎక్క‌డా పుట్టడం లేద‌ని పాటందుకున్నాడు.అంటే ఇచ్చిన గ్యారెంటీలు అమ‌లు చేయ‌లేం.

దీనికి కార‌ణం కేసీయారే అని చెప్ప‌డం రేవంత్ ఉద్దేశం. మ‌ధ్య‌లో బ‌లైంది. వెర్రిపుష్పాలుగా మిగిలింది. ఆశ‌కు ఆత్రుత ప‌డి దురాశ‌ దుఃఖానికి చేట‌ని తెలంగాణ జ‌నానికి అర్థం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఈ రెండు గుంట‌న‌క్క‌ల పార్టీలు ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు మోసం చేశావంటే నువ్వు మోసం చేశావ‌ని రంకెలేస్తున్నాయి. జ‌నాలు చెవ్వుల్లో పువ్వులు పెట్టుకుని చూస్తున్నారు. ఎంత న‌టిస్తున్నార్రా మీరు.. కానీ మాకిది కావాల్సిందే అని న‌వ్వుకుంటున్నారు. వైరాగ్య‌దీన‌హీన‌దుర్భ‌ర‌ద‌రిద్ర ప‌రిస్థితుల‌ను ఊహించుకుని.

You missed