రాష్ట్రంలో తిట్ల రాజకీయం బహు రంజుగా సాగుతున్నది. ఒకరినొకరు.. ఒకరికి మించి మరొకరు. షేర్ అంటే సవ్వా షేర్. బద్దలు బాషింగాలు చేస్తారోయ్ అని ఒకడంటే.. నువ్వో ఫాల్తు గాడివిరా అని ఇంకొకడు. ఒకుడు లేచి తొడగొడతాడు. ఇంకొకడు సాలే.. గాండూ అని ముద్దుగా బామ్మర్ధిని తిట్టినట్టు తిడతాడు. ఓరేయ్ బాతాల పోశెట్టి.. లత్కోర్ అని ఒకడంటే.. అరేయ్ లుచ్చా , లఫంగా అని మరొకడు లేస్తాడు. రారా సూస్కుందాం అని ఒకడంటే.. ఒంగోబెట్టి గుద్దుతరరేయ్ అని ఇంకొకడు హెచ్చరిస్తాడు. ఒరేయ్ బక్కోడా అని ఒకడు వెక్కిరిస్తే.. ఓరేయ్ గుండు వెధవా.. అని ఇంకొకడు ఎడ్డిస్తడు. ఇక్కడ ఇప్పుడు బూతులు స్వేచ్చగా విహరిస్తున్నాయి. కొత్త సినిమాలు లేవు.. కొత్త డైలాగులు లేవు. కానీ తెలంగాణ రాజకీయ తెరపై మాత్రం అద్దరిపోయి ఈలలేసి గోలచేసే డైలాగులు పుట్టుకొస్తున్నాయి. సినీ రచయితలకే కొత్త డైలాగులు నేర్పిస్తున్నాయి. భావదారిద్రం కాదు .. మనది భాష దారిద్రం. తిట్ల దండక రాజకీయం వర్దిల్లాలి.
జై అర్వింద్
జై బండి సంజయ్
జై మైనంపల్లి
జై రేవంత్రెడ్డి
జైజై మల్లారెడ్డి