నిన్న మంత్రి మల్లారెడ్డి రేవంత్ పై రెచ్చిపోయి తిట్ల దండకం అందుకున్నాడు. పనిలో పని పిచ్చకుంట్లోడా అంటూ ఓ కులం పేరు తీసుకుని సంబోధిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆ కులం మంత్రి మల్లారెడ్డి పై విరుచుకు పడుతున్నది. మీరూ మీరూ తిట్టుకోండి.. తన్నుకోండి.. మధ్యలో మా కులం ప్రస్తావన ఎందుకు మల్లారెడ్డి అని నిలదీతల పర్వం మొదలుపెట్టారు. నాలుక కరుచుకున్న మల్లారెడ్డి రెండు చేతులెత్తి దండం పెట్టాడు. క్షమించండయ్యా అని బతిలాడాడు.
