లోకల్ యాప్ సర్వే ఒకటి వెల్లడైందని, తెలుగు వన్ న్యూస్ దీన్ని ప్రచురించిందంటూ సోషల్ మీడియాలో ఓ సర్వే రిపోర్టు వైరల్ అవుతున్నది. ఇది కంప్లీట్ ఫేక్ సర్వే అని చాలా మంది కొట్టేస్తున్నారు. కానీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇండియా టుడే సర్వేలో తెలంగాణ సర్కారు గ్రాఫ్ పడిపోయిందని వచ్చిన రిపోర్టులకు ఊతమిచ్చినట్టుగా , కాంగ్రెస్‌కు అనుకూలమైన ఫలితాలు వచ్చేలా ఉంది ఈ రిపోర్టు. ఇలా తమ పార్టీల బలాలను ప్రదర్శించేందుకు సర్వే ఫలితాల పేరుతో జనాల మీదకు తోసి.. ఎవరికి వారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్‌కు మాత్రం తక్కువ శాతం ఇచ్చి దీని పని అయిపోయిందిక అనే సందేశం మాత్రం ఇవ్వడంలో సక్సెసవుతున్నారు.
లోకల్ యాప్ సర్వేలో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే .. ఓట్లు శాతాల్లో..
కాంగ్రెస్‌కు 40, బీజేపికి-34, టీఆరెస్ 26..
తమ ఉనికిని పెద్దగా చాటుకునేందుకు టీఆరెస్‌ను మాత్రం అట్టడుగుకు పడేస్తున్నారు. టీఆరెస్ సోషల్ మీడియా కూడా దీనిపై స్పందించడం లేదు. మొన్నటి ఇండియా టుడ్ సర్వే ఫలితాలతో నోరెళ్లబెట్టారో..? ఏం చెప్పాలో? ఎలా కౌంటర్ చేయాలో తెలియకో.. ? ఏమో తెలియదు కానీ, టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్ ఈ మధ్య మౌనం పాటిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్న సమయంలో టీఆరెస్‌ను బలిపెడుతున్నాయి. దీన్ని నిలువరించే విషయంలో అధికార పక్షం పూర్తిగా విఫలమవుతున్నది. ఇంకా ఎన్ని ఫేక్ సర్వేలొస్తాయో? ఒకటి మాత్రం పక్కా.. ఎన్ని సర్వేలు వచ్చినా.. అందులో టీఆరెస్‌ను చివరకు నెట్టేస్తారు.