(దండుగుల శ్రీనివాస్)
తోలు తీస్తాం.. ఊకోం..! అన్నడు మొన్న కేసీఆర్. మళ్లీ ఫామ్‌హౌజ్‌లనే సేదతీరుతున్నడు. కానీ ఇక్కడ ఆయన బిడ్డె కవిత .. తోలు తీసి ఆర బెట్టింది. నిండు సభ సాక్షిగా. కేసీఆర్ ఒక మేక వన్నె పులి అని తేల్చిపారేసింది. జనానికి ఏది నిజం.. ఏది అబద్దం..? ఖుల్లం ఖుల్లాగా తేల్చి పారేసింది. స్వయంగా ఆయన బిడ్డెనే ఇంతలా చెప్పిందంటే.. కన్నీటి పర్యంతమైందంటే.. రాజకీయాల కోసం ఇంటి ఆడబిడ్డె ఉసురు తీసేందుకు కూడా వెనకాడలేదంటే.. ఇక వీరి గురించి ప్రత్యేకంగా జనం అనుకునేదేముంటుంది. మేక వన్నె పులి అనేది అందరికీ అర్థమైపోయింది. ఆ మేక తోలు కప్పుకున్న పులి చర్మాన్ని వలిచేసింది కవిత.
కేసీఆర్ అధికార పార్టీ నేతల తోలు ఎప్పుడు తీస్తాడో తెలియదు కానీ.. అంతకు ముందు.. ఇంత తొందరగా ఆయనే బిడ్డె స్వయంగా కేసీఆర్ తోలు తీసింది. తీయడమే కాదు.. దాన్ని ఉప్పు పెట్టి మంచిగా ఆరబెట్టింది. పాడుకాకుండా. రేపు రేపు అంతా చూడాలె కదా. ఇగో మేక తోలు కప్పుకున్న పులి అని చూపడానికి. ఆమెకు ఎంతలా అవమానం జరిగితే ఇంత మాట్లాడాలె. ఆమెను ఎంత హింస పెడితే ఇంతగా బాధపడాలె. ఎంతటి అహంకారం చూపితే .. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఆమె గర్జించిన బెబ్బిలి కావాలె..! అందుకే దాని ప్రతిఫలం అనుభవించారు తండ్రీకొడుకులు. కవితను ఆషామాషీ అనుకున్నారు.
ఏహె.. ఏం చేస్తుందులే అని గంజిలో ఈగ లెక్క తీసిపారేశారు. ఇప్పుడు ఆ ఈగ… ఎస్ ఎస్ రాజమౌళి ఈగ సినిమాలో రివేంజ్‌ను మించిపోయి చూపింది నిండు సభ సాక్షిగా. ఉన్నదున్నట్టుగా చెప్పేసింది. అసలు తోలు తీయడం కాదు.. బట్టలిప్పేసి బరిబాతల నిలెబెట్టింది. తండ్రిని. అన్నను. పార్టీ మొత్తాన్ని. తెలంగాణ జాతిపిత కాదు.. ఏం కాదు.. కన్నబిడ్డెను కన్నీళ్లు పెట్టించిన కర్కోటకుడు అని కూడా చెప్పేసింది కవిత. ఇక ఆయన ఫామ్‌హౌజ్‌నుంచి వచ్చి తోలు తీసే పని కాకుండా.. జనానికి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అగత్యమైతే ఏర్పడింది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
