వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్:
అరే ఇంకా అహకారం తగ్గేలేదు బై. మల్లా మల్లా గవే మాటలు. జనం కర్రుకాల్చి వాత పెట్టినా ఈళ్లకు ఇంకా బుద్దిరాకపాయ. ఇకనన్నా మరుతరని అనుకున్నం. కానీ హెచ్చులకే పోతున్నరు. ఎక్కువ చేస్తున్నరు. అయ్య అట్లనే. కొడుకూ అట్లనే. తెలంగాణను కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా కేటీఆర్? అంటే తెలంగాణ కోసం అమరులైన వాళ్లను కూడా లెక్కలోకి తీసుకోరా? ఎవరు చచ్చినా పర్లేదు.. ఎవరెట్ల పోతే మీకెందుకు? గొప్పులు మీకే కావాలె. తిట్లూ మీరు తిట్టాలె. మీరేం చెప్తే అది కరెక్టు. మీరు ఏది కరెక్టు కాదంటే అది కరెక్టు కాదు. అంతె కదా కేసీఆర్..! అంతే కదా కేటీయారు!!
మరి తెలంగాణ తెచ్చిన జాతిపితను జనం ఎందుకు ఫామ్‌హౌజ్‌ల పండవెట్టిర్రు. మీ లోపాలు, పాపాలు ఎప్పుడన్న లెక్కలేసుకున్నరా? దిద్దుకుందామనే ఆలోచన ఏనాడైన చేసిండ్రా..! ఏమన్నా అంటే జనం పైస పిచ్చోళ్లు. ఉచిత హామీలకు ఆశపడి కాంగ్రెస్‌ను గెలిపించండ్రని తప్పంతా వాళ్లదే అన్నట్టు మాట్లాడుతున్నరిద్దరు. ఇట్లనే ఉంటే.. ఇట్లనే అంటే మరింత లోపలకు గొయ్యి తీసి కప్పెడతరు జనం. అందరితో పెట్టుకోర్రి కానీ.. జనంతో పెట్టుకోకుర్రి…. ఇది అయ్యకు బాగా తెలిసిపోయింది. కుర్రకుంక.. పిల్లకాకికే ఇంకా తెల్వలేదు. అందుకే తండ్రిచాటు బిడ్డెలెక్కనే ఉంటున్నడు. ఎగిరెగిరిపడుతున్నడు. ఇగో గివే ముచ్చట్లు సోషల్ మీడియా నిండా. రామన్నను పొట్టుపొట్టు.. తుక్కు తుక్కు తిడ్తున్నరు. దుమ్మెత్తిపోస్తున్నారు.
