(దండుగుల శ్రీ‌నివాస్)

అక్రిడిటేష‌న్ ఆందోళ‌న‌ల వెనుక న‌మ‌స్తే తెలంగాణ హ‌స్తం ఉందా? కావాల‌నే కొంద‌రు కిరికిరి చేస్తున్నారా? అస‌లు అక్రిడిటేష‌న్‌ల కోసం మొత్తుకుంటున్న వాళ్లు కేసీఆర్ స‌ర్కార్‌లో జ‌రిగిన అన్యాయాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. అక్రిడియేష‌న్ కార్డులే కాదు.. జ‌ర్న‌లిస్టుల కూడా ఆనాటి స‌ర్కార్ గుర్తించ‌లేదు. సుప్రీంకోర్టు జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇవ్వాల‌ని చెప్పినా.. చెత్త‌బుట్ట‌లో ప‌డేసిన చ‌రిత్ర నాటి కేసీఆర్ స‌ర్కార్‌ది. వాళ్ల ఉసురు పోసుకుని.. చ‌ట్ట‌బద్దంగా రావాల్సిన స్థ‌లాలు ఇవ్వ‌కుండా గ్యాస్ సిలిండ‌ర్‌కు స‌బ్సిడీ ఇప్పిస్తామ‌ని హేళ‌న చేసిన చ‌రిత్ర కేసీఆర్ స‌ర్కార్‌ది. అక్రిడిటేస‌న్ కార్డులుకేవ‌లం గుర్తింపు మాత్ర‌మే. ఇళ్ల స్థ‌లాలు జీవితానికి సంబంధించిందినంది. రెండింటికీ గండికొట్టిన స‌ర్కార్ ఏదైనా ఉందంటే.. అది కేసీఆర్ స‌ర్కారే..

వాస్త‌వానికి, జ‌వ‌హార్‌లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీకి స్థ‌లాలు ఇవ్వాల‌ని 2022లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని అమ‌లు చేయ‌కుండా.. జ‌ర్న‌లిస్టుల కంట నీరు పెట్టించిన ఘ‌న‌త ఎవ‌రిద‌యా అంటే .. అది కేసీఆర్ స‌ర్కార్‌దే. త‌రువాత క‌నీసం.. స్థ‌లాలు స్వాధీన ప‌రుచ‌మ‌ని, జీవో జారీ చేయ‌మ‌ని వేడుకున్నా కరుణించ‌లేదు. కానీ, కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత క‌రుణ చూపింది. ముఖ్య‌మంత్రి రేవంత్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకుని జీవో జారీ చేశారు. కానీ దుర‌దృష్ణ‌వశాత్తు.. దేవుడు క‌రుణించినా.. పూజారి అనుగ్ర‌హించ‌లేద‌న్న‌ట్టు.. సీఎం పూర్తిగా స‌పోర్టు చేసినా.. అనూహ్య‌మైన రీతిలో సుప్రీంకోర్టు మ‌రో ధ‌ర్మాస‌నం స్థ‌లాల కేటాయింపును ర‌ద్దు చేసింది. ఇప్ప‌టికీ కాంగ్రెస్ స‌ర్కార్ జ‌ర్న‌లిస్టుల‌కు న్యాయం చేయ‌డానికి ఏదో ఒక ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెతుకుతూనే ఉంది. కానీ, అన్ని ప‌వ‌ర్లు చేతిలో ఉన్న కేసీఆర్ మాత్రం.. మీకు గ్యాస్ స‌బ్సిడీ కాలేద‌ని వెట‌కారం చేశారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌తో న‌వ్వుతూ తుల్లుతూ ముచ్చ‌ట పెట్టి.. వారితో క‌లిసి భోజ‌నం చేస్తూ వారిలో కొత్త ఆశ‌లు రేపింది కేసీఆరే. ఈయ‌నే తెలంగాణ‌కు సీఎం అయితే మా బ‌తుకులు ఎంత‌గా మారుతాయో క‌దా..? అనుకున్నారంతా పిచ్చోళ్లు. కానీ, ఏమైంది? క‌ల్లులో ఈగ క‌న్నా అధ్వానంగా చూశాడు కేసీఆర్‌. తెలంగాణ రాగానే.. మాది ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన నాటి నుంచి అన్యాయ‌మైన అనేక రంగాల్లో ప్ర‌ధానంగా ఉన్న‌ది జ‌ర్న‌లిస్టు రంగం. నిజంగా చెప్పాలంటే.. కేసీఆర్ అన్యాయం చేసింది.. విస్మ‌రించింది కొంద‌రిని కాదు.. అంద‌రినీ. ఏ ఒక్క‌రినీ ఇందులో త‌క్కువ చేసి చెప్ప‌లేం. నేనే జ‌ర్న‌లిస్టును కాబ‌ట్టి.. నా కోణంలో నేను చూసిన నా అనుభ‌వం ఇక్క‌డ చెప్ప‌ద‌లుచుకున్నాను.

ఎవ‌రైనా ప్రెస్‌మీట్‌లో ప్ర‌శ్న‌లు వేసినా.. ఎదురు ప్ర‌శ్న‌లే. గేలి జ‌వాబులే. వెకిలి చేష్ట‌లే. ఇంకోసారి న‌న్ను ఎవ‌రూ ఇలా ప్ర‌శ్నించొద్దు అని మిగితా వారికి అదో హెచ్చ‌రిక‌న్న‌ట్టు. ఏ పేప‌ర్ వ‌యా నీది..? ఇగ రాస్కో.. నీకు దమ్ముందా..? ఏ ఊకో.. నీకేం తెల్సు.. అంటూ హేళ‌న‌గా మాట్లాడి జ‌ర్న‌లిస్టు అనేవాడికి అస‌లు ఆత్మ‌గౌర‌వ‌మే లేద‌నేలా వ్య‌వ‌హ‌రిచింది కేసీఆర్ కాదా? ఇవ‌న్నీ మ‌రిచారు మ‌నోళ్లు. మ‌ళ్లీ కేసీఆర్ రావాల‌నుకుంటున్నారు పాపం కొంద‌రు. వ‌చ్చినా కేటీఆర్‌ను సీఎం చేయాల‌నే క‌దా ఆ ముస‌లాయ‌న తాపం.. తాప‌త్ర‌యం. మ‌రి కేటీఆర్ ఏం చేస్తాడో తెలుసా? ఆయ‌న పెంపుడు యూట్యూబ్‌లు, వెబ్‌సైట్ల‌లో ప‌నిచేసే వారిని మాత్ర‌మే జ‌ర్న‌లిస్టులుగా చూస్తాడు. అది కాని ముచ్చ‌ట ఎందుకంటారా? ఒక‌వేళ అయితే గియితే వారి మైండ్ సెట్ అలా ఉంది అని చెప్ప‌డం నా ఉద్దేశ్యం.

Dandugula Srinivas

Senior Journalist

7661066999