వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

శీతాకాలం స‌మావేశాలు గ‌రం గ‌రంగా మొద‌లు కాబోతున్నాయి. ఈ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారు.. వ‌స్తారు.. వ‌స్తారు.. వ‌చ్చేస్తున్నారు.. అంటూ ఒక‌టే ఊద‌ర‌గొడుతున్నారంతా. కానీ ఆయ‌న వ‌స్తాడు. వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోతాడు. అంతే. అంత‌కు మించి అక్క‌డ గులాబీలు కోరుకునేదేదీ జ‌ర‌గ‌దు. అంతా ఊహించి, భ్ర‌మించినంత సీన్ ఉండ‌దు. ఆ స‌భ ఇప్పుడు కేసీఆర్‌కు ముళ్ల కుర్చీలాంటింది. ఇంత త‌క్కువగా కూర్చుంటే ఆయ‌న‌కు అంత హాయి. బ‌య‌ట‌ప‌డితే హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. అంత‌లా భ‌య‌ప‌డుతున్నాడు రేవంత్‌రెడ్డి ధాటికి కేసీఆర్‌. ఈ మూడు నాలుగు రోజుల స‌భ‌లో సంతాప తీర్మానాలు, ఆర్డినెన్స్‌ల బిల్లుల‌కు ఓకే చెప్పేసుకుని ముగించేస్తారంతే.

కేసీఆర్ వ‌స్తే నీటి వాటాల పంపిణీపై రేవంత్ రెడ్డి చ‌ర్చిస్తామ‌న్నారు. అంటే.. దీనికీ అంత చాన్స్ ఉండ‌న‌ట్టేన‌నిపిస్తుంది. ఒకవేళ డిస్క‌ష‌న్ పెట్టినా ష‌రా మాములుగా హ‌రీశ్‌నే ముందు పెడ‌తారు. కేసీఆర్ సారు మ‌ట్లాడేంత సీన్ అక్క‌డ లేదు. ఆయ‌న ఇప్పుడు ప్రెస్‌మీట్ టైగ‌ర్‌గానే ఉండిపోతున్నారు. స‌భ‌లో మాట్లాడే సీన్ లేన‌ట్టే. అప్పుడెప్పుడో బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాల్గొని మెరుపుతీగ‌లా వెళ్లిపోయారు. ఇప్పుడూ అంతే. పెద్ద మార్పు లేదు. ఉండ‌దు.