(దండుగుల శ్రీనివాస్)
తను చేస్తే సంసారం.. కేసీఆర్ తీరు అంతే. ఎవరికీ పేరు రావొద్దు. అంతా తననే కీర్తించాలి. తెలంగాణ జాతిపిత అనాలె. గాంధీ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకోవాలె. అంతటి కీర్తి కండూతి కోసం కేసీఆర్ కక్కుర్తి పడుతూ ఉంటాడు.అందుకే వేరొకరు ప్రశ్నించినా తట్టుకోడు. పేరు తెచ్చుకునేందుకు తనను దాటి పోతానన్న భరించడు. ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను అందుకే తోలు తీస్తానంటున్నాడు. తొక్కలో ఫ్యూచర్ సిటీ అని మరీ దిగజారి మాట్లాడుతున్నాడు. అసలు ఎవరి తోలు ఎవరు తీయాలి? ఈ ఉల్టా చోర్ మాటలెందుకు కేసీఆర్… ఇప్పుడిదే అందురూ అంటున్నది. ప్రశ్నిస్తున్నది. అనుకుంటున్నది.
ఇప్పుడు కేసీఆర్ ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ కార్ రేస్ కేసు.. అక్రమాస్తులు కూడబెట్టుకుని..ఇప్పడా పంపకాల్లో విభేధాలు.. తండ్రి, కొడుకు, కూతురుకు మధ్య గ్యాప్.. బంధాలు తెగిపోయిన వైనం.. ఇవన్నీ జనం చూస్తున్నారు. చీదరించుకుంటున్నారు. ఇంకా మీకు బుద్దిరాలేదురా అని తిట్టుపోస్తున్నారు. అయినా కేసీఆర్ మారలేదు. జనం మమ్మల్ని ఓడించి తప్పు చేశారని తిడుతున్నాడు. మీకు తగిన శాస్తే జరిగిందని సైకో ఆనందం పొందుతున్నాడు.
పథకాల పేరుతో, కాళేశ్వరం పేరుతో 8 లక్షల కోట్ల అప్పు చేసి .. రాష్ట్రాన్ని దివాళ తీపించి.. ఇప్పుడు 420 మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. అందుకే అప్పుడు మీ తోలు తీశారు జనం.. ఈ సర్కార్‌కు ఇంకా టైమ్ ఉంది. దీని తోలు తీయాలా వద్దా అని డిసైడ్ చేసేది జనం. మీరు కాదు. మీ తోలు ఎందుకు తీశారో జర పరవర్తన తెచ్చుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. తప్పులు దిద్దుకుని జనం మనసు గెలిచేందుకు ప్రయత్నం చేయండి. జనం తీర్పును గేలి చేసి మరీ ఎగతాళి కాకండి. ఇట్లనే ఉంటే మళ్లీ మళ్లీ మీ తోలు తీస్తారు జనం. అంతకు ముందు ఈ సర్కార్ మీ తోలు తీసేందుకు రెడీ అయ్యింది. పాత పాపాల చిట్టాను ముందేసుకున్నది. ఒక్కొక్కటీ ఇప్పుడు విచారణ క్లైమాక్స్ కు వస్తున్నది. తీర్పు వెలువడడమే తరువాయి.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
