(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇద్ద‌రికీ సొంత పేప‌ర్లున్నాయి. సొంత టీవీ చానెళ్లూ ఉన్నాయి. ఒక‌ప్పుడు ఇవుంటే ఇక వానంత తోపు లేడ‌న్న‌మాట‌. వాళ్ల‌తో పెట్టుకోవ‌డానికే ఉచ్చ ప‌డేది. కానీ ఇప్పుడు న‌డిచేది సోష‌ల్ మీడియా కాలం. ఎవ‌డినీ వ‌ద‌ల‌డం లేదు. ఏ మాత్రం చాన్స్ ఉన్నా.. ఉచ్చ పోయించేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, పోలీసులు.. ఎవ‌రినీ ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. అంతెందుకు వాడెవ‌డో ఐబొమ్మ ర‌వి.. వాడిని దొర‌క‌బ‌ట్టుకున్న‌రు. ఇగ పోలీసులు చంక‌లు గుద్దుకున్న‌రు. మాకు ఎన‌లేని పేరు వ‌స్తుంద‌ని. కానీ సోష‌ల్ మీడియాలో క్వైట్ ఆపోజిట్ సిట్యూవేష‌న్‌. వాడో హీరో.. మీరే దొంగ‌ల‌ని.. సినిమా వాళ్ల‌ను తుక్కు తుక్కు దొబ్బి ఇడిస‌బెట్టిర్రు. పాపం.. పోలీసు అధికారులు .. సీఎంకు రాని పేరు మాకు వ‌స్తుంద‌ని క‌ల‌లు క‌న్నారు. ఏమీ రాలే. స‌రే, ఇప్పుడిదంతా ఎందుకుగానీ, బెంగ‌ళూరులో ఓ ప్రోగ్రాం. అక్క‌డ ఏపీ నుంచి మాజీ సీఎం జ‌గ‌న్.. ఇక్క‌డ తెలంగాణ నుంచి షాడో మాజీ సీఎం కేటీఆర్‌.. ఇద్ద‌రూ హాజ‌ర‌య్యారు.

ఇద్ద‌రూ ఒక్క చోట చేరితే ఇక చేతినిండా ప‌నే సోష‌ల్ సోల్జ‌ర్స్‌కు. ఇద్ద‌రినీ ఆడుకున్నారు. చెల్లెల్ల పోరును మ‌రోసారి గెలికారు. ఇద్ద‌రూ ఇద్ద‌రేన‌ని తేల్చిపారేశారు. అధికారం కోసం మ‌మ‌కారం వ‌ద‌లుకున్న నేత‌లిదిగో అని మ‌రోసారి ప్రపంచానికి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అంతే కాదు.. ఎంపీ ఎన్నిక‌ల్లో మ‌నిద్ద‌రికీ జీరో వ‌చ్చాయ‌ని ఒక‌రంటే.. ప్ర‌ధాన ప్రతిప‌క్షం మ‌న‌మే క‌దా బ్రో.. అని మ‌రొక‌రు స‌ర్ది చెప్పుకునే ప‌ర‌మానంద‌య్య శిష్యుల‌క‌న్నా అదధ్వానం చేసి మ‌రీ చూపించేశారు. ఇప్ప‌టికే ఎలా అధికారంలోకి రావాలో ఆలోచ‌న‌లో ప‌డి దినాం స‌చ్చీ చెడి ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటే.. వీళ్ల‌మో ఇక్క‌డ ఇలా ఇజ్జ‌త్ తీయ‌బ‌ట్టే. నానాటికీ ఇంకా జ‌నం ముందు ఈ ఇద్ద‌రూ యువ మాజీ సీఎంల ప్ర‌తిష్ట దిగ‌జారుతుంటే.. వీళ్లు ఇంకా దిగ‌జారుస్తున్నారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999