(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఈ నేల ఎంత అమాయ‌కంగా క‌నిపిస్తుందో.. అంత చైత‌న్య‌మైంది కూడా. త‌మ‌ను ఆక్ర‌మించుకోవాల‌నుకున్న‌ప్పుడు.. త‌మ‌ను తొక్కేయాల‌ని చూసిన‌ప్పుడు.. ఇక్క‌డి యావ‌దాస్తి త‌మ‌దైన‌ట్టు ప్ర‌వ‌ర్తించి బానిస‌లుగా చూసిన‌ప్పుడు… ఆ చైత‌న్యం ప్ర‌ద‌ర్శిస్తుంది ఇక్క‌డి నేల‌. ఆ మ‌న‌స్త‌త్వాల‌ను, ఆ మ‌నుషుల‌ను బొంద పెడుతుంది. ఓ నిజాం పిశాచం అట్ల‌నే చేశాడు.. గ‌త పాల‌కుడు కేసీఆర్ కూడా ఇట్ల‌నే ప్ర‌వ‌ర్తించాడు….ఈ మాట‌ల‌న్న‌ది సీఎం రేవంత్‌రెడ్డి. అందె శ్రీ సంస్మ‌ర‌ణ స‌భ లో ఆయ‌న మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ద‌ళిత వ్య‌తిరేకి కేసీఆర్ అని తిట్టిపోశాడు. అందుకే స‌జీవ ఉదాహ‌ర‌ణే.. అందెశ్రీ రాసిన జ‌య జ‌య‌హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతం కాకుండా చేశాడ‌ని అన్నారు. క‌ళాకారుల‌ను బొంద పెట్టాల‌ని చూసి త‌నే గోతిలో ప‌డిపోయాడ‌న్నారు. ఉద్య‌మ‌కారుల ఉసురు పోసుకుని కాన‌రాకుండా పోయాడ‌ని తిట్టిపోశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ,వారే ముందుండి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారని అన్నారు. వారు లేకుంటే తెలంగాణ లేదని అన్నారు. ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చి న ఊపుతోనే తెలంగాణ సాకారమైందని, ఇది ఎవరూ కాదనలేని నిజమన్నారు. అంతేగాకాకుండా వారే తెలం గాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోసారని అన్నారు.. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన జయజ యహే తెలంగాణ పాట రాశారు. బడికి వెళ్ళని అందె శ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉంది అని రేవంత్‌ తెలిపారు.

బాధతో.. ఉద్వేగంతో చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని కోరుకు న్నారు. ఉద్యమంలో ప్రతి నాలుక విూద, ప్రతి వేదిక విూ ద జయ జయ జయహే తెలంగాణ పాట నిలిచించింది.. తెలంగాణ గీతం స్ఫూర్తి నింపిన కవులు, రచయితలను కించపరిచే విధంగా గత పాలకుల చర్యలు ఉన్నాయని సీఎం రేవంత్‌ అన్నారు.అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని గుర్తు చేశారు. ఊరూరా పాటలతో అందెశ్రీ ఉద్యమానికి ఊపిరిలూదారని అన్నారు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూగబోయింది. ఆయనను పట్టించు కున్న పాపాన పోలేదన్నారు. పాలకుల దృష్టిలో పదేళ్లు మూగబోయి ఉండొచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండె ల్లో నిత్యం గానమై నిలిచిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం ఆనాడు జరిగిందన్నారు. కవి రాసే పెన్నుల విూద మన్ను కప్పితే.. అవి గన్నులై మొలకె త్తుతాయ్‌.. విూ గడీలను కుప్పకూలుస్తాయ్‌ అన్న నినాదా న్ని అందెశ్రీ నిజం చేశారని సిఎం రేవంత్‌ అన్నారు. ప్రజలు కోరుకున్న జయ జయహే తెలంగాణను.. రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా.. ప్రతి బడిలో పాడాలి, పాఠ్య పుస్తకాల్లో రాయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతు లని తెలంగాణ ఉద్యమమే రుజువు చేసిందన్నారు.ఈ గడ్డ విూద ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహిం చలేరని, అందుకు నడుస్తున్న చరిత్రే సాక్షాత్కారమని అన్నారు.

ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూరు వజ్రం ప్రత్యేకం. అలాగే ఎందరు కవులు ఉన్నా.. డా.అందెశ్రీ ప్రత్యేకంఅని సీఎం అన్నారు. తెలంగాణ ప్రాంతం ఎంత ప్రేమ చూపిస్తుందో.. అంతే పోరాటాన్ని కూడా చేస్తుం దని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులూ ఎన్నో పోరాటాలు చేశారు.. గతంలో నిజాం సర్కార్‌ వాళ్ళను సైతం ఎదురొడ్డి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందని సీఎం చెప్పారు. గద్దర్‌, గోరేటి వెంకన్న వంటి ఉద్యమకారులు తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని రూపకల్పన చేశారన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం గుర్తించింద‌ని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రావాలని అందె శ్రీ, గద్దర్‌ లాంటి వాళ్ళ స్ఫూర్తి తోనే ఏర్పడింద‌న్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నామ‌ని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 9 మంది ఉద్యమ కారులను గుర్తించామ‌ని, రాబోయే రోజుల్లో ఫ్యూచర్‌ సిటీలో వారి కుటుంబానికి ఇళ్లను నిర్మించి అండగా నిలుస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమ కారులదని, దేశంలో ఎస్సి వర్గీకరణ అమలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిద‌న్నారు. రాష్ట్రమంత్రి వర్గంలో దళితులకు పెద్ద పీట వేయడం అనేది సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆకాంక్షల మేరకే నిర్ణయాలు తీసుకున్నామ‌ని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.