(దండుగుల శ్రీ‌నివాస్‌)

సారే రావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా..! కేసీయారే కావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా!! పాట బాగ‌నే రాయించారు. కానీ ఆ పాటలో అర్థం మీలోని బలుపు చేష్ట‌ల‌నే ప‌ట్టిస్తోంది. క‌నీసం ఆ సోయి కూడా లేదు. త‌ప్పు తెలుసుకునే స్థితిలో మీరుంటే క‌దా.. అందులో లోప‌మేందో తెలిసేదీ! జ‌నం క్లారిటీగా మిమ్మ‌ల్ని ఓడించారు. వ‌ద్ద‌నుకున్నారు. మీ త‌ప్పు తెలుస‌కోండ‌ని ఓ చాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇచ్చారు. దాని సంగ‌తి కూడా గ‌మ‌నిస్తారు. ఏదీ ఎవ‌ని సొత్తు కాదు. జ‌నం ఎవ‌రికి న‌చ్చితే వారికే ఓటేస్తారు. వారినే గ‌ద్దెనెక్కిస్తారు.

సారే కావాలంటున్నారని.. మీరే జ‌నం వాయిస్‌ను బ‌ల‌వంతంగా లాగేసుకుని పాట పాడేసుకుని.. మేమే వ‌స్తున్నామ‌ని చెప్పేసుకుని, వ‌స్తామ‌ని ధీమా, పొగ‌రు చూపించేసుకుని…. అబ్బ‌బ్బ ఎన్ని..ఎన్ని ఎన్ని ఘోరాలు.. ఇంకా మార‌రా? అని జనం విస్తుపోయి.. చీకొట్టి.. ఛీత్క‌రించుకున్నా… మేమింతే అంటున్నారు తండ్రీకొడుకులు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. సారే రావాలంటున్న‌రే… కేసీయారే కావాలంటున్న‌రే…! అస‌లు కేసీఆర్ ఒక్క‌సారైనా బ‌య‌ట‌కు వ‌చ్చాడా? రాలేదు. అంటే ఓడిపోతే .. ఫామ్‌హౌజ్‌లో ఉండాల్నా? జ‌నం పై క‌సి పెంచుకోవాల్నా? మీకు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని వారు కష్టాలు ప‌డ్డా చూసి పైశాచికానందం పొందాల్నా?

క‌నీసం.. క‌నీసం.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీకు ఇంపార్టెంటే క‌దా. జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్యే క‌దా. మ‌రి రెండు చేతులెత్తి ఆ ఓట‌ర్ల‌ను ఓటేయండి అని ఎందుకు అడ‌గ‌లేదు కేసీఆర్‌? అంత బ‌లుపా? అంత ధీమానా? మేం కాక‌పోతే మీకెవ‌రూ లేరు.. మేమే దిక్క‌నే దిక్కుమాలిన మీ నియంత పోక‌డ‌నా? అందుకే పింకీల‌కు, పీంకీ బానిస‌ల‌కు చెప్పేదేమిటంటే.. సారు… ఫామ్‌హౌజుకే ప‌రిమిత‌మై.. చిన్న సారు సోష‌ల్ మీడియాలో త‌ల‌పెట్టి.. బ‌య‌ట వాస్త‌విక ప్ర‌పంచాన్ని చూడ‌కుండా అదే ద‌ర్పం, అహంకారం ప్ర‌ద‌ర్శిస్తే.. ఇవే ఫ‌లితాలు ప‌దే ప‌దే.. వ‌స్తాయి.. మీరు మాత్రం.. ఇంకా ఇంకా పాడుకుంటూనే ఉండండి.. సారే రావాలంటున్న‌రే.. కేసీయారే కావాలంటున్న‌రే..! అంత‌కు మించి మీరు చేసేది కూడా ఏం లేదు!

Dandugula Srinivas

Senior Journalist

7661066999