(దండుగుల శ్రీనివాస్)
తండ్రి చాటు బిడ్డగానే ఉన్నది నిన్నమొన్నటి వరకు. అన్నను అందలమెక్కించడం ఆమెకు నచ్చలేదు. ఇంకా ఎన్నేళ్లైనా తన పరిస్థితి పార్టీలో కరివేపాకేనని గ్రహించిందామె. అందుకే తండ్రీ, అన్న జాన్తానై అన్నది. బయటకు వచ్చింది. వేరు కుంపటి పెట్టింది. తనదాని తాను చూసుకున్నది. త్వరలో రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఆమె ఉంది. అందులో భాగంగానే జనంబాట పేరుతో ఓ నాలుగు నెలలు జనంతో కలిసి తిరగనుంది ఆమె. ఆ తరువాత పార్టీ పేరు, విదివిధానాలు ప్రకటించనుంది. అయితే ఈలోపు హరీశ్‌రావు తండ్రి చనిపోయాడు. అంతా ఆసక్తిగా గమనించారు. ఆమె .. అంత్యక్రియలకు హాజరవుతుందని. కానీ ఆమె కాలేదు. అదీ ఇప్పుడు చర్చ. వార్త.
ఎంతటి రాజకీయాలున్నా.. ఎవరి పదవుల కాంక్ష ఎంత తీవ్రంగా ఉన్నా.. బంధతత్వం, మమకారం కూడా మరుస్తారా? అవను. కవితక్క మరిచింది. ఆమె కావాలనే హరీశ్‌రావు తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఇదీ ఇప్పుడు హాట్ టాపిక్. తండ్రితో, అన్నతోనే విభేదించిన తరువాత ఇక హరీశ్ ఎలా కనబడుతాడు. అందులోనూ హరీశ్‌ను, సంతోష్‌లను ఆమె తుక్కు తుక్కు తిట్టిందాయె. మొత్తానికి ఓ ముచ్చట మాత్రం క్లారిటీకి వచ్చింది. కవిత… ఆమె బంధుగణంతో ఆమడదూరం ఉంది. పెట్టింది. పెడుతోంది. వాళ్లు కూడా ఆమెను ఇక అదే స్థాయిలో చూస్తారు. ఇప్పుడు ఆ వెలమ కుటుంబాల్లో ఎవరి రాజకీయాలు వారివే. నో బంధుత్వం, నో మోర్ మమకాలరాలు, ఆత్మీయతలు.. ఇదీ సంగతి!
Dandugula Srinivas
Senior Journalist
7661066999
