వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

అదే అహంకారం ఒక‌రిలో. అంద‌రికీ అందుబాటులో ఇంకొక‌రు. అదే నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి ఒక‌రిలో. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యే త‌ప‌న‌లో ఇంకొక‌రు. ఈ ఇద్ద‌రూ ఎవ‌రో తెలుసా? ఒక‌రు కేటీఆర్‌. ఇంకొక‌రు న‌వీన్ యాద‌వ్‌. అదేనండి నే చెప్పేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి. అక్క‌డ బీఆరెస్ క్యాండిడేట్‌గా మాగంటి సునీత కాదు పోటీ చేసేది… అచ్చంగా కేటీయారే. అవును.. ఎందుకంటే అంత‌కు ముందు కూడా ఇక్క‌డ పెత్త‌న‌మంతా ఆయ‌న‌దే. పేరుకే మాగంటి గోపినాథ్. ఆయ‌న కేటీఆర్ బినామీ. ఇప్పుడు ఆమె భార్య‌ను తీసుకొచ్చారు. సానుభూతి ద‌క్కుతుంద‌ని. కానీ ఇసుమంతైనా బీఆరెస్ ఆశించింది అక్క‌డ జ‌ర‌గ‌డం లేదు. కేటీఆర్ అహంకారం, అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో చూపిన నిర్ల‌క్ష్యం, అల‌స‌త్వం ఇంకా అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాల‌ను మ‌ళ్లీ చేయ‌నీయొద్ద‌నే భావ‌న‌లో వాళ్లున్నారు. అభివృద్ది వైపే వాళ్ల న‌జ‌రంతా. అందుకే అక్క‌డ ఓట‌ర్ల పంథా మారింది. ఎంత చ‌మ‌టోడ్చినా, ఎన్ని వ్య‌య ప్ర‌యాసాలు ప‌డినా అక్క‌డ మాగంటి సునీతకు మైలేజీ కాదు కాదు.. కించిత్ సానుభూతి కూడా దొరక‌డం క‌ష్టంగా ఉంది. ఇప్పుడిదే బీఆరెస్‌లో ఆందోళ‌న రేపుతున్న అంశం.

ఆ గ‌ట్టునుంటావా నాగ‌న్నా? ఈ గ‌ట్టుకొస్తావా? అనేది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజ‌కవ‌ర్గ ఓట‌ర్ల‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. జూబ్లీహిల్స్‌లో గెలుపు బీఆరెస్‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా మారింది. ముందు రానున్న లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో తాము ఇంకా జ‌నాల్లో ఉన్నామ‌నే ఉనికి చాటుకునేందుకు ఈ గెలుపు అనివార్య‌మైంది. ఇదే విష‌యాన్ని కేసీఆర్ కూడా ఫామ్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ చెప్పాడు. అందుకే ఎలాగైన గెలిచి తీరాల‌ని భావిస్తున్నారు. అందుకే ఫేక్ వార్త‌లు కూడా వండి వారుస్తున్నారు. కానీ అక్క‌డ లోక‌ల్‌గా మాత్రం ఓట‌ర్లు డిసైడ‌యి కూర్చుకున్నారు. మాగంటి సునీత కుటుంబంపై మొద‌టి నుంచి అక్క‌డ నెగిటివ్ ఫీలింగుతోనే ఉన్నారు జ‌నాలు. ఎవ‌రికీ మాగంటి క‌ల‌వ‌క‌పోవ‌డం, జ‌నాల‌కు దూరంగా రాజ‌కీయం చేయ‌డం.. అభివృద్ది విష‌యంలో హామీల‌కే ప‌రిమితం కావ‌డం.. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే కేటీఆర్ అహంకారం ఆ పార్టీకి పెద్ద మైన‌స్. అందుకే అక్కడ బీఆరెస్ గెలుపు కోసం ఏటికి ఎదురీదుతున్న‌ది.