ఆత్మీయత ఆమడదూరం.. మమకారం మాటేలేదు! కవితక్క ఎంత కఠినం! హరీశ్ తండ్రి అంత్యక్రియలకూ హాజరుకాని వైనం! రాజకీయం కోసం బంధువులతో తీవ్ర అంతరం పెంచుకున్న కవిత!
(దండుగుల శ్రీనివాస్) తండ్రి చాటు బిడ్డగానే ఉన్నది నిన్నమొన్నటి వరకు. అన్నను అందలమెక్కించడం ఆమెకు నచ్చలేదు. ఇంకా ఎన్నేళ్లైనా తన పరిస్థితి పార్టీలో కరివేపాకేనని గ్రహించిందామె. అందుకే తండ్రీ, అన్న జాన్తానై అన్నది. బయటకు వచ్చింది. వేరు కుంపటి పెట్టింది. తనదాని…
