(దండుగుల శ్రీనివాస్)
ఈవీఎంలు వద్దని కాంగ్రెస్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నది. బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ తన వాదన వినిపిస్తూ వస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చాల వేదిక ద్వారా తన డిమాండ్‌ను వెలిబుచ్చుతూ వస్తున్నారు కూడా. ఇటీవలే ఆయన ఈవీఎంలపై కామెంట్ చేశారు. ఈవీఎంలా ద్వారా ఓట్లు రిగ్ అవతున్నాయనే ఆరోపణలను ఆయన బలంగా వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై తాజాగా కేటీఆర్ కూడా ఇదే లైన్ తీసుకున్నారు.
ఏకంగా బీఆరెస్ లీడర్ల టీమ్‌తో కలిసి ఈసీని కూడా కోరడం చర్చనీయాంశమైంది. చాలా దేశాల్లో ఈవీఎం ప్రయోగం విఫలమైందని, దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో, అగ్ర దేశాలు సైతం మళ్లీ పేపర్ బ్యాలెట్‌కు వెళ్లాయనే ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆరెస్ నిలిచినట్టయింది. గతంలో బీఆరెస్ దీనిపై పెద్దగా మాట్లాడలేదు. బీజేపీలో బీఆరెస్ విలీనం, పొత్తు ఆరోపరణలు, ప్రచారం నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టేందుకు ఇదో అస్త్రంగా ఉపయోగపడుతుందా? అనే వ్యూహం ఇందులో దాగుందా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
