(దండుగుల శ్రీ‌నివాస్‌)

జ‌ర్న‌లిస్టు ముసుగులో ఎవ‌రిని ప‌డితే వారిని తిడుతూ ప‌బ్బం గడుపుకున్నాడు. జ‌ర్న‌లిస్టు వాస‌న‌లు మ‌చ్చుకైనా క‌నిపించ‌ని ఆ వండి వార్చిన‌, రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే క‌థ‌నాలు.. అప్పుడు కాంగ్రెస్‌కు కంటికి క‌నువిందుగా, వీనులకు విందుగా క‌నిపించాయి. కేసీఆర్‌ను తిట్టేవాడు లేడురా.. వీడు తిడుతుండు.. తిట్ట‌నీ.. అని పెంచి పోషించిండ్రు. త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు. బాతాల పోశెట్టి.. అంటే అబ్బ ఏం తిట్టాడ్రా..? ఆడు మ‌గాడ్రా బుజ్జా..? అని కీర్తించిన ఆ నోళ్ల‌లో కూడా ఇప్పుడు మ‌ట్టి కొడుతున్నాడు. అది వేరే విష‌యం. తైత‌క్కా అని వ‌ద‌ల సార్లు.. త‌క్కువేమో.. వేల సార్లూ అన్నాడు. మ‌రి ఆనాడేం చేశార‌క్కా.. మీరు.. మీ టీము..! ఇప్పుడెందుకీ ర‌చ్చ‌. వాడంతే. వార్త‌ల్లో ఉండాలె. నీతి లేదు నియ‌మం లేదు.

14Vastavam.in (5)

పెంచి పోషించిన కాంగ్రెస్సే ఎట్లా తుంటాలా అని ఆలోచిస్తుంది. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టు.. ఇప్పుడు నీ సంగ‌తి చూస్తా బిడ్డా…! అంటే.. ఇదేదో బాగుందిరో.. శ‌త్రువుకు, శత్రువు మిత్రుడే సుమీ అనుకుని కామ్‌గా గ‌ట్టు మీదుండి తామాషా చూస్తున్నారిప్పుడు. వాడు మాట్లాడేది జ‌ర్న‌లిజం కాదు. కానీ ఆ ముసుగుంది. ఆ ముసుగులోనే ఇవ‌న్నీ కొనసాగుతున్నాయి. అప్పుడూ అంతే. తైత‌క్కా అంటే ఏ జ‌ర్న‌లిజంలో ఇట్లా ఉందిరా..? అని గ‌ల్లా ప‌ట్టి అడిగే ద‌మ్ములేక‌పాయె అప్పుడు. ఇప్పుడు నిప్పుర‌వ్వ‌లా ద‌హించి వేస్తానంటే నవ్వుకుంటున్నారు. ఇదంతా జ‌రిగే ముచ్చ‌టేనా అనుకుంటున్నారు. ప‌నిలో ప‌ని … అవ‌స‌రమొచ్చింది కాబ‌ట్టి.. మొన్న‌టి వ‌ర‌కు ఛీ ఇదేం కులం లెక్క‌లు.. అంతా తూచ్ అన్న నోరే.. మా సారు.. మా సీఎం అని వంత పాడుతున్నాడు. అంతే ఏ ఎండ‌కు ఆ గొడుకు. నీతి, నియ‌మాలు, క‌ట్టుబాట్లు.. ఇవ‌న్నీ ఎక్క‌డివి..? అయినా ఈ దాడుల సంస్కృతిని ఎక్క‌డ్నుంచి ప‌ట్టుకొచ్చున్న‌రు.

అన్నాచెళ్లెల్ల‌కిద్ద‌రికీ ఇది మంచిది కాదు. అది ఏ న్యూస్ చానెల్ అయినా. ఆడ‌బిడ్డ‌పై వ‌ల్గ‌ర్‌గా మాట్లాడితే ఆనందించేంత సైకో స‌మాజం కాదిది. అంతా గ‌మ‌నిస్తారు. ఎవ‌డిని ఏడ పెట్టాలో.. ? ఎవ‌నికి ఏ స్థానం ఇవ్వాలో.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చెప్పుతో కొట్టిన‌ట్టు చెబుతారు. తొంద‌రెందుకు..? అస‌లు మ‌న‌కు జ‌నామోదం ఉందా లేదా..? జ‌నం వ‌ద్ద మ‌న రిసీవింగ్ బాగుందా లేదా..? వాళ్లు ఆద‌రిస్తున్నారా లేదా..? అస‌లు మ‌న‌ల్ని న‌మ్ముతున్నారా లేదా..? ఇది క‌దా ముందు చూసుకోవాల్సింది. అది వ‌దిలి రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌లా .. వాడెవ‌డో ఉచ్చ‌నీచాలు మ‌రిచి ఒర్రిండ‌ని ర‌చ్చ‌కెక్కితే.. మ‌న టైమే వేస్టు. మ‌నం స్పందించామ‌ని తెలిస్తే.. మ‌రింత రెచ్చి పోయి కాల‌రెగురేసుకుంటాడే త‌ప్ప‌.. జ‌రిగేదేం లేదు. బాతాల పోశెట్టి, ర‌కుల్‌రావు, తైత‌క్క, అగ్గిపెట్టె మ‌చ్చ‌… ఇవ‌న్నీ అన్న‌నాడే.. గ‌ల్లా ప‌ట్టి అడ‌గాల్సింది.

అడిగే విధానాలు చాలా ర‌కాలు. అవి దాడులే కాన‌క్క‌ర‌లేదు.

Dandugula Srinivas

Senior Journalist

8096677451