వాస్తవం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాడు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారన్నాడు. కావాలని కొన్ని మీడియా సంస్థలు మరియు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామ‌ని పేర్కొన్నాడు.

29Vastavam.in (4)

గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల కానీ వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవ‌ని, కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన త‌న‌ కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయ‌న్నాడు.

వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చ‌రించాడు. కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటామని వెల్ల‌డించాడు.

You missed