(దండుగుల శ్రీనివాస్)
రేవంత్ పదే పదే ఢిల్లీకి వెళ్తున్నాడు.. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తయిందని ఓ వైపు కేటీఆర్, మరోవైపు కవిత దుమ్మెత్తిపోస్తున్నారు. రాహుల్‌గాంధీ వారికి టైమ్ కూడా ఇవ్వడం లేదంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రాహుల్‌ని కలవాలని ఏం రూల్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని బదులిచ్చాడు సీఎం రేవంత్. గురువారం ఆయన తన టీమ్‌తో ఢిల్లీ వెళ్లిన నేపథ్యం .. బిజీబిజీగా తెలంగాణ అంశాలను ప్రస్తావించిన వైనం బాగుంది. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరడంతో పాటు మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైనా సీఎం విన్నవించాడు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌నీ కలిశాడు.
తప్పదు ఢిల్లీ పోవాల్సిందే. అందర్నీ కలవాల్సిందే. విన్నపాలు వినపించాల్సిందే. సమస్యలు పరిష్కరించాల్సిందే. రాహుల్‌తో ఫోటో ఏదీ..? రాహుల్ టైం ఇవ్వలేదట కదా. ఎందుకు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు..? ఇవన్నీ ప్రతిపక్షాల కామన్ ఎత్తిపొడుపులే. సీఎం ఢిల్లీ టూర్‌తో ఏం ప్రయోజనం సమకూరిందనేదే పాయింట్.