(దండుగుల శ్రీనివాస్)
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదనుకుందట. కవితైతే కచ్చితంగా అట్ల అనుకోదు. ఎందుకంటే తనేం చేస్తున్నాననే విషయం తనకు ఓ క్లారిటీ అయితే ఉంటుంది. కాకపోతే సమయం వచ్చే వరకు ఇలా గోడ మీద పిల్లిలా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుందన్నమాట. డ్యాడీ ఎత్తేసిన ధర్నాచౌక్ దగ్గర డ్యాడీ కోసమే ధర్నా చేసింది కవిత. అది ఫెయిల్ అయింది. జాగృతి టీమ్ అంతా వచ్చి వేదిక మీద కూసుంది. ముందు మాత్రం ఎవరూ లేరు. కవిత స్పీచ్ వినడానికి. గులాబీ కండువా లేదు. ఉండదు ఇకపై. అంతా జాగృతి టీమ్. అవే కండువాలో. భారత్ జాగృతి ఉండదు. తెలంగాణ జాగృతే. ఇకపై ఆమె వేసే ప్రతీ స్టెప్ కేసీఆర్, కేటీఆర్‌ను మరింత ఇరకాటంలో పడేసేవిగా ఉంటాయి.
పార్టీని డ్యామేజీ చేసేవిగానే ఉంటాయి. కేసీఆర్ భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టిన కవిత.. అన్నకు సూటి పెట్టింది. పార్టీ ఫండ్ 1300 కోట్లకు తండ్రి.. అన్నకే పవర్స్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలైన కథ… అధికారం వచ్చినంక ఇక తను ఉనికే ఉండదనే భయం నేపథ్యంలో వచ్చిన ఆలోచనే కవిత ఈ వేరు కుంపటి ముచ్చట. కాళేశ్వరం విషయంలో తండ్రికి నోటీసులివ్వడం యావత్ తెలంగాణకు ఇచ్చినట్టేనన్న ఆమె.. మధ్యలో మేఘా కృష్ణారెడ్డి విషయాన్ని తీసుకొచ్చింది. అతనిదే ఈ ప్రాజెక్టులో మేజర్ షేర్ ఉంది కాబట్టి ఎందుకు.. నోటీసులివ్వలేదు అన్నది. అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్నదా..? తండ్రికే ఎందుకిచ్చారు..? ఆయనకెందుకు ఇవ్వలే అంటున్నదా..? తండ్రే స్వయంగా మేఘాను సన్మానించిన దృశ్యాలు కూడా ఇప్పుడు పోస్ట్ అవుతున్నాయి.
మరి తండ్రి మెచ్చిన కాంట్రాక్టర్ పేరును ఎందుకు తీసినట్టు…. అసలు తప్పే జరగలేదని వాదిస్తున్నప్పుడు కాంట్రాక్టర్ ముచ్చట ఎందుకు..? మేఘా పేరు తీసి ఎవరికి ఇరుకున పెట్టాలని కవిత ఆలోచన..? రేవంత్‌రెడ్డినా..? కేసీఆర్‌నా..?? ఇంటి గొడవలను, అదే తన తండ్రితో, అన్నతో ఉన్న ఆస్తుల, అధికార లొల్లిలో ఇలా జాగృతిని వేదిక చేసుకుని ఉనికి కోసం ఆమె పోరాడుతున్నదని అందరికీ అర్థమైపోయింది. ఆమె మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకునేలా లేరు. తండ్రి లోపాలు, శాపాలపై లేఖనే విడుదల చేసి.. ఆపై దేవుడని చెబుతూనే ఇలా తండ్రి కోసం ఆయన పేరునే వాడుకుని పొగిడిందా..? తిట్టిందా..? అని అనుమనాలు లేవనెత్తుతూ .. తన పని తాను చేసుకుంటూ పోతోంది ఆమె. సమయం వచ్చే వరకు ఇలాగే ఉంటుంది ఆమె ప్రతీ స్టెప్ కూడా. అది పార్టీని, కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఇరకాటంలో పడేసేలాగే ఉంటాయి. డౌట్ లేదు. మరింత డ్యామేజీని చేస్తాయి. ఇందులోనూ డౌట్‌లేదు. ఇందుకు తొలి శాంపిల్ ధర్నాచౌక్ దగ్గర ఆమె చేసిన ధర్నానే.