(దండుగుల శ్రీ‌నివాస్‌)

రేవంత్ నోటి వెంట వ‌చ్చిన సుభాషితాల్లో ఇదొక‌టి. చెరువు మీద అలిగి క‌డుక్కోపోతే మ‌న‌కే కంపుకొడ‌త‌ది. ఇది నాగ్‌కు ప‌క్కా తెలుసు. ఎందుకంటే నాగ్ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్‌. ఏదో ఇంట‌ర్వూలో చూశాను. జ‌గపతిబాబు అన్నాడు… ఎలా సంపాదించాలి..? ఎంత ఖ‌ర్చు చేయాలో ప‌క్కాగా క్యాలుక్కులేటెడ్‌గా నాగార్జున ఉంటాడ‌ని. నిజ‌మే అనిపిస్తుంది ఈ దృశ్యం చూశాక‌. ఇవాళ సీఎంను క‌లిశారు నాగార్జున దంప‌తులు.

త‌న కుమారుడి పెండ్లికి ల‌గ్న ప‌త్రిక‌ను అందించేందుకు. వ‌చ్చీ రాగానే, పీఠం ఎక్కీ ఎక్క‌గానే అదేదో ప్ర‌జ‌ల‌కు ఎంతో ముఖ్య‌మైన అంశ‌మైన‌ట్టు… హైడ్రా పెట్టి.. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్‌కు సూటి పెట్టాడు రేవంత్‌. ముందు నాగ‌లి ఎలా పోతే మ‌నోళ్లు అలాగే పోతారు క‌దా. అక్క సురేఖ అందుకున్న‌ది. ఏవేవో గ‌లీజ్ మాట‌లు విడిచింది. దీనిపై అంతా థూ అన్నారు. ఆమె మాట్లాడిన భాష ఎవ‌రికీ న‌చ్చ‌లే. కానీ రేవంతు వెనుకేసుకొచ్చాడు. ఏకంగా ఈ విష‌యంలో కోర్టు మెట్లెక్కాడు నాగ్‌.

అంతకు ముందు ఎన్ క‌న్వెన్ష‌న్ విష‌యంలో కూడా కోర్టు దాకా పోయాడు కానీ, ఆలోపు ఖ‌తం ప‌ట్టించేశాడు కొత్త సీఎం. ఇలాంటి స‌మ‌యంలో.. సినీ పెద్ద‌ల‌తో మీటింగు ఏర్పాటు చేస్తే.. నాగ్ హాజ‌ర‌య్యాడు. ఏమీ క‌డుపులో పెట్టుకోకుండా. ఇప్పుడు ఇలా కొడుకు పెండ్లికి ర‌మ్మ‌న్నాడు. న‌వ్వుతూ. న‌ట‌న‌లో భాగంగా కాదు. నిజంగానే. అయినా క‌య్యానికి కాలు దువ్వితే న‌ష్టం ఎవ‌రికీ..? అర్థం కాలేదా..? అయితే సీఎం భాష‌లో అడుగుతా…! చెరువు మీద అలిగి క‌డుక్కోపోతే ఏం అవుతుంది..?

You missed