(దండుగుల శ్రీ‌నివాస్‌)

కొత్త స‌ర్కార్ ఏర్ప‌డిన త‌రువాత రెండో సారి ఇది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం. ఎన్నో ఆశ‌లు పెట్టుకుని మార్పు కోరుకున్న జ‌నాల‌కు ఇంకా నిరాశే. ఎన్నో ఆశ‌లను ఆవిరి చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్ప‌టడుగుల‌తోనే సాగుతోంది రేవంత్ స‌ర్కార్‌. త‌ప్పు దిద్దుకునే ప‌నిలో ఉంది ఇంకా. కొత్త ప‌థ‌కాలుంటాయ‌ని, ఇవాళ సీఎం అనౌన్స్ చేస్తాడ‌ని అనుకున్నారు చాలా మంది. నిధులు లేవు. ఖ‌జానా ఖాళీ అని గ‌గ్గోలు పెట్టినా.. ఇవాళ ఏదో ఒక కొత్త ప‌థ‌కం ఉంటుంద‌నే ఆశ‌లు పెట్టుకున్నా.. అక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. కొత్త ప‌థ‌కాలు లేవు. పాత ప‌థ‌కాలకు బ్రేక్‌. ప్ర‌స్తుతం ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కార్‌లో న‌డుస్తున్న తంతు ఇదే.

02Vastavam.in (5)

ఈరోజు రాజీవ్ యువ వికాసం ప‌థ‌కం మొద‌టి లిస్టు ల‌బ్దిదారుల జాబితా ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారు. దీన్నీ బ్రేక్ వేశారు. అన‌ర్హులంతా వ‌చ్చి చేరార‌ని ఏకంగా సీఎం చెప్ప‌డం ఈ ప‌థకం ఎంత త‌ప్పుదోవ‌లో న‌డుస్తుందో తెలుస్తోంది. ఎమ్మెల్యేల క‌క్కుర్తి ఈ ప‌థ‌కంలో బయ‌ట‌ప‌డింది. దాదాపు 60 శాతం నుంచి 70శాతం వ‌ర‌కు అంతా అన‌ర్హులే. ప‌థ‌కం పైస‌లు కొల్ల‌గొట్టేందుకు అంతా రెడీ అయ్యారు. దీనిపై ఏకంగా మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేసే వర‌కు వ‌చ్చింది. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌రిస్థితీ ఇదే. రైతు భ‌రోసా దిక్కు లేదు. దీంట్లో కూడా సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తార‌ట‌. మొద‌ట్లో భ‌య‌ప‌డ్డారు. ఇప్పుడు అన‌ర్హులున్నార‌ని గ‌గ్గోలు పెడుతున్నారు.

రేష‌న్‌కార్డు కండిష‌న్ పెడ‌తారేమో బ‌హుశ‌. వీటిన‌న్నింటిపై ఈనెల 5న కేబినెట్ మీటింగు పెట్టుకుని వీటి అన్నింటిపై నిర్ణ‌యాలు తీసుకుని ప్ర‌క‌టిస్తార‌ట‌. చూడాలి. ఏం చేస్తారో. రేవంత్ స‌ర్కార్ హ‌యాంలో వ‌చ్చిన రాష్ట్ర ఆవ‌త‌ర‌ణ ఆవిర్భావ దినోత్స‌వ రెండో వేడుక‌లు ఉసూరుమ‌నిపించాయి. ఇంకా అంచ‌నాలుండ‌వు. ఆశ‌లుండ‌వు. అన్న‌ట్టుగానే సాగుతోంది రేవంత్ పాల‌న‌.