(దండుగుల శ్రీ‌నివాస్‌)

క‌విత‌పై ఆంధ్ర‌జ్యోతిలో వ‌స్తున్నఎపిసోడ్స్ ఉత్త ముచ్చ‌ట్లేన‌ని ఏఐసీసీ వ‌ర్గాలు ఖండించాయి. ఆమెను పార్టీలోకి తీసుకోవ‌డ‌మా..? మాకేం అవ‌స‌రం..?? అని ముచ్చ‌టించుకుంటున్నాయి. గ‌త రెండు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌విత ఇష్యూ వాడివేడిని పుట్టిస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్ట‌నుంద‌నే వార్త క‌న్నా.. కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉంద‌ని, ఆరుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకుని వ‌స్తే మంత్రి ప‌ద‌వి ఇస్తారా..? అని రాసే వార్త‌ల‌పై ఢిల్లీ పెద్ద‌లు న‌వ్వుకుంటున్నారు. అలాంటి ప్ర‌తిపాద‌న వ‌చ్చినా ఒక్క నిమిషం ఆల‌స్యం చేయ‌కుండా తిర‌స్క‌రించ‌డ‌మే ఉంటుందని ఏఐసీసీ కీల‌క నేత ఒక‌రు వాస్త‌వంతో చెప్పారు.

29Vastavam.in01

అదంతా వండివారుస్తున్న వార్త‌లు త‌ప్పితే.. అందులో వాస్త‌వం లేద‌నే విష‌యంగా పేర్కొన్నారాయ‌న‌. ఇదేం జ‌ర్న‌లిజం..? అని ఆర్కేను క‌విత అడిగి, ఏదో శాడిజం అని తిట్టడంతో మ‌రింత రెచ్చిపోయాడు ఆర్కే. అందుకే ఆయ‌న ప‌త్రిక‌లో ఇవాళ మ‌రింత డ్యామేజీ చేసే విధంగా ఆరుగురు ఎమ్మెల్యేల‌ను ప‌ట్టుకొస్తా… మంత్రి ప‌ద‌వి ఇస్తారా..? అని అడిగిన‌ట్టుగా వ‌చ్చిన వార్త మ‌రింత రాజ‌కీయంగా దుమారం రేప‌గా.. ఇది కూడా ఫేకేన‌ని క‌విత ఆ క‌థ‌నాన్ని ఖండిస్తూ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

కానీ ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. కామెంట్ చేయ‌డం మూలంగా మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునే విధంగా ఆ ప‌త్రిక‌లో క‌థ‌నాలుంటాయ‌ని ఆమె భావించిన‌ట్టుంది. అందుకే సైలెంట్‌గా ఆ వార్త క‌థ‌నం త‌ప్ప‌ని పేర్కొన్న‌ది. మ‌రోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు క‌విత ఎపిసోడ్‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. చ‌ర్చించుకుంటున్నాయి.

You missed