(దండుగుల శ్రీనివాస్)
వాస్తవం ముందే చెప్పింది. ఆర్కే కవిత భుజం మీద తుపాకి పెట్టిండని. సూటి తండ్రికి పెట్టిండు. కాంగ్రెస్‌తో రాయభారమని నిన్నరాసిండు. ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా మంత్రి పదవి ఇస్తారా..? అని అధిష్టానాన్ని అడిగిందని ఇయ్యాల రాసిండు. ఇగ రాస్తనే ఉన్నడు. ఓ మంత్రి పదవి కోసం ఆమె కాంగ్రెస్ పార్టీని అడుక్కోవాల్సిన దుస్థితి లేదు. బీఆరెస్ బలపడుతోందనీ తెలుసు. కాంగ్రెస్ జనం ముందు పలుచనవుతోందని తెలుసు. తనకు కావాల్సింది పార్టీలో గుర్తింపు. అది దొరికేలా లేదు. ఇవ్వరు. అన్నకు అందలం.. చెల్లెకు మంగళం.. ఇదే కేసీఆర్ తీరు. ఇది తెలిసిపోయింది.
ఆస్తుల వాటాలెక్క.. ఇప్పుడు ఆ పార్టీలో రాజకీయ వాటా మొదలైంది. బిడ్డెనైనంత మాత్రానా నాకేం తక్కువ.. దేంట్లో నేను తక్కువ అని కవిత తనకు తనే ప్రశ్నించుకుని, కేసీఆర్‌ను ప్రశ్నలతో ముంచెత్తి, తన ఉనికిని చాటుకుని .. పార్టీలో తన వాటా కోసం గళమెత్తి సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మధ్యలో ఆర్కే తగులుకున్నాడు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే ఉంది అతగాడికి. రోజుకో కథ అల్లుకుని అచ్చేస్తున్నాడు. ఇది ఆమెను మరింత కుంగదీస్తోంది. నిన్ననే అన్నది. ఇదేం జర్నలిజం అంకుల్.. మీది శాడిజం అని కూడా అన్నది. అయినా ఊకుంటడా..? మరింత రెచ్చిపోయాడు. ఈసారి మంత్రి పదవిని అడుక్కుంటోందని రాశాడు. అధిష్టానం ఓకే అంటున్నది. రేవంత్ వద్దంటున్నాడని రాసుకొచ్చాడు. ఆమెకు కావాల్సింది మంత్రి పదవి కాదు. సీఎం సీటు మరి కాంగ్రెస్ ఇస్తుందా.? వాళ్లకు వాళ్లే పీకులాడుకుంటున్నారు నాకు మంత్రి పదవంటే నాకు మంత్రి పదవని. ఇక సీఎంల లిస్టు బారెడుంది.
ఇప్పుడు ఈ సమయంలో కవితను తీసుకోవడాన్ని, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరు స్వాగతిస్తారు..? ఆమెకు ఎవరు గౌరవం ఇస్తారు…? ఎవరు పట్టించుకుంటారు..? కేసీఆర్ దగ్గర అప్పుడు మంత్రులు ఎట్లా గుర్తింపు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారో.. అంతకంటే ఘోరంగా కవిత పరిస్థితి ఉంటుంది అక్కడ. సింగరేణి జాగృతి అని ప్రత్యేక టీములు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు…? జాగృతికి పార్టీ రంగుఎందుకు పులుముకుంటున్నట్టు.. ఇదంతా ఆమె ఫ్యూచర్ ప్లాన్. ఆర్కే రాసిన వార్తలను రెండింటిపై ఫేక్ అనే ముద్రవేసిందామె. ఒకటి కొత్త పార్టీ విషయంలో. ఇంకొకటి కాంగ్రెస్‌తో రాయబారమనే వార్తను. కానీ కొత్త పార్టీ పెట్టేందుకు చాలా సమయమే తీసుకోవచ్చు. అప్పటి వరకు ఇలా జాగృతికి పొలిటికల్ యూటర్న్ ఇచ్చి తను పార్టీలోనే ఉంటూ వేరు కుంపటి పెట్టినట్టుగా వ్యవహరిస్తూ వస్తుందన్నమాట. సమయం వచ్చినప్పుడు పార్టీ పెట్టొచ్చు. అప్పటి వరకు కాంగ్రెస్ పై ఆమె పోరాడుతూనే ఉంటుంది. బీఆరెస్ కంటే ఎక్కువే. బీజేపీపైనా మాటల దాడి చేస్తుంది.
బీఆరెస్‌కు మించి. ఇదంతా ఆమె వ్యూహం. మధ్యలో అంకుల్ వచ్చి అంతా చెడగొడుతున్నాడు…! ఇప్పుడిదే ఆమె బాధ. మీడియా ఆమెను పట్టించుకోవడం లేదు. అంతకు ముందు మీడియాను ఆమె పట్టించుకోలేదు. ఆమె వార్తలకు ఎక్కడా ప్రయార్టీ దొరకడం లేదు. చివరకు నమస్తే తెలంగాణతో సహా.
