(దండుగుల శ్రీనివాస్)
అధికారం ఉన్నప్పుడే ప్రజలను కలుస్తా.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలపై అలుగుతా అనే తత్వం కేసీఆర్‌ది అని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టాడు. థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఆయన అనుభవం.. కానీ అసెంబ్లీకి రాడు… సలహాలివ్వడు… ప్రజల కోసం పోరాడడు… ఫామ్‌హౌజ్‌లో పంటడు.. నేనైతే ఇప్పటి వరకు సెలవు తీసుకోలే అని అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ లా తనకు అహంభావం లేదని, తను అందరివాడనని అన్నాడు.
చిన్నపెద్దా తేడా లేకుండా అందరితో కలిసి పనిచేస్తానని, అందరి సమస్యలు వింటానని అన్నాడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం పీఎం మోడీని ఎన్ని వందలసార్లైనా కలుస్తా… నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. ఈ ప్రాంత ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అన్నాడు. చెరువుపై అలిగితే మనదే ఎండుతది… అట్లనే అలిగి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పండుకున్నాడని విమర్శించాడు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు రాబడతానన్నాడు.