(దండుగుల శ్రీ‌నివాస్‌)

అమాస‌రోజు భారీ బ‌హిరంగ స‌భ‌. ఎన్నో అంచ‌నాలు. మ‌రి పాండిత్యం అంతా న‌మిలి ఊసేసిన కేసీఆర్‌కు ఇది తెలియ‌దా..? లేక ఆయ‌న ఇవ‌న్నీ ప‌ట్టించుకుంటే న‌డ‌వ‌ద‌ని లైట్ తీసుకున్నాడా..? చిన్న వేడుక‌ల‌కే ముహూర్తాలు, రాహుకాలాలు చూసుకుంటారు సాధార‌ణంగా జ‌నాలు. ఇప్పుడీ ఓరుగ‌ల్లు మ‌హాస‌భ.. అంతా ఆషామాషీ కాదంటున్నారు అంతా. లేస్తే మ‌నిషికాను అన్న‌ట్టుగా లేక లేక లేస్తున్నాడు ఏడాదిన్న‌ర త‌రువాత‌. అదీ పార్టీ ప్లీన‌ర్ పేరు చెప్పి. అందులోనూ ర‌చ్చ. అస‌లు మీది ఏ పార్టీ. ఏ పార్టీ అయినా 25 ఏండ్లు ఏడ నిండిన‌య‌ని.

అంతే కాదు. సీఎంగా ఉన్నప్పుడు తొమ్మిదేండ్ల‌కే ద‌శాబ్ది ఉత్స‌వాలు చేసిన ఘ‌నుడాయె.. ఇప్పుడు ఏ పార్టీకి నిండ‌ని 25 ఏండ్లు ఆపాదించి ఓ వేడుక‌కు, సంబురానికి ఓ వేదిక ఎంచుకున్నాడు. ఇంతే కాదు. వ‌రంగ‌ల్ ను ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు ఎంపిక చేయ‌డం ప‌ట్లా ఓరుగ‌ల్లు జ‌నం భ‌గ్గుమంటున్నారు. మంచిగా ప‌చ్చ‌గా ఉన్న‌ప్పుడు మాత్రం మెద‌క్, గ‌జ్వేల్ క‌నిపిస్తాయి. ఇప్పుడు ఆప‌ద కాలంలో ఉన్న‌ప్పుడు మాత్రం ఉద్య‌మాల గ‌డ్డ‌ను ఎంచుకుని సెంటిమెంట్ రాజేసుకుని మ‌ళ్లీ ఇక్క‌డి జ‌నాన్ని మోసం చేసేందుకా… ? ఇదీ ఓ నిల‌దీత‌. ఓ ప్ర‌శ్న‌. అంతా అనుకున్న‌ట్టే.. అవ‌మానించిన‌ట్టే… శాపాలు పెట్టిన‌ట్టే… ఓ ఎద్దు ఎండ‌దెబ్బ‌కు తాళ‌లేక చ‌చ్చిప‌డింది. ఆ ఫోటోను కూడా అటాచ్ చేసి కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు.

బండెన‌క బండిక‌ట్టి … ఇదిప్పుడు ఇంత ఎండ‌లో అవ‌స‌ర‌మా.. ఇన్ని స్టంట్లు చేసి మంది పానాలే కాదు.. ప‌శుప‌క్షాదుల పాణాలూ మింగుతారా..? ఇదీ ఓ నిల‌దీతే. స‌ర్వం తెలిసిన స‌న్నాసికి అమాస‌రోజే దొరికిందా..? ఇదీ ఓ ఆశ్చ‌ర్య‌మే. ఓ విసుగుతో కూడిన ప్ర‌శ్నే. భారీ వ‌ర్షం ప‌డి స‌భ ర‌ద్దు కావాల‌ని ఒకడు శాపాలు. అక్కడ ఉగ్ర‌మూక‌ల దాడుల‌తో దేశం ర‌గిలిపోతుంటే మీరేందిరా బై ఈ సంబురాలు..? ఇంకొక‌డి దేశ‌భ‌క్తితో కూడిన ధ‌ర్మాగ్ర‌హం. స‌రే స‌రే చేసుకున్న‌వ్ పో… కానీ ఆ క‌ర్రెగుట్ట‌ల‌ల్ల జ‌రిగే మార‌ణ‌హోమం ఆపాల‌ని ఓ చిన్న‌మాట ప‌లుకు. నీ నీట్లో ముత్యాలేం రాలిపోవుగానీ. ఇదీ ఓ సూచ‌న‌. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట‌ల‌న్నీ ఈడ మాట్లాడు. జ‌నానికి ఏద‌న్నా మేలు చేసే నాలుగు ముచ్చ‌ట్లు చెప్పు… ఇదీ ఓ హిత‌బోధ‌. ఇలా కేసీఆర్‌కు అంద‌రూ చెప్పేవాళ్లే అయ్యారు. తిట్టేవాళ్లే ఉన్నారు. దుమ్మెత్తిపోసేవాళ్లే జ‌మ‌య్యారు. అన్నింటికీ కార‌ణం అమాసే. అవునా అమాస ఇంత ప‌వ‌ర్‌ఫుల్లా…? ఏమో చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed