(దండుగుల శ్రీ‌నివాస్‌)

సేమ్ కేసీఆర్ లెక్క‌నే. అధికారం రాగానే సీఎంలు ఇలాగే మారుతారు. స్పీక‌ర్‌పై సీఎం గుస్సా అయ్యిండు. ఎందుకు..? ప్ర‌తిప‌క్షాల‌కు ఎక్కువ స‌మ‌యం ఇచ్చిండ‌ని. వారి గొంతు ఎక్కువ పెంచేందుకు స‌మ‌యం చిక్కింద‌ని. దీనికి బాధ్యుడిని స్పీక‌ర్‌ను చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. అవును… ఇదిప్పుడు గాంధీభ‌వ‌న్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌. అంతా అసెంబ్లీ బాగా జ‌రిగింద‌నే అంటున్నారు. గ‌తంలో కేసీఆర్ వ‌న్‌సైడ్ వార్‌లా కాకుండా…అంద‌రికీ స‌మన్యాయం జ‌రిగేలా స్పీక‌ర్ వ్య‌వ‌హ‌రించాడ‌నే అభిప్రాయం ఉంది. కానీ ఇది సీఎంకు న‌చ్చ‌లేదు.

వారికంత స‌మ‌యం అవస‌రం లేకుండె. మైక్ క‌ట్ చేయాల్సి ఉండె. మ‌ధ్య‌లోనే వారి వాద‌న‌కు బ్రేక్ వేయాల్సి ఉండె. అనేది సీఎం వాద‌న‌గా ఉంది. ఇదే విష‌యాన్ని ఆయ‌న స‌హ‌చ‌ర మంత్రివ‌ర్యుల‌తో క‌లిసి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. బీఆరెస్‌ను ఎంత బ్లేమ్ చేస్తే అంత మంచిద‌నే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎక్కువ స‌మ‌యం అధికారప‌క్ష స‌భ్య‌ల‌కిస్తే మ‌రింత‌గా వారిని ఇర‌కాటంలో పెట్టొచ్చ‌నేది స‌భా నాయ‌కుడి ఎత్తుగ‌డ‌. కానీ ప్ర‌తిప‌క్ష బీఆరెస్‌కు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌శ్న‌లు సంధించ‌డం దానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు సీఎం స్వ‌యంగా రంగ‌లోకి దిగి న‌ష్ట నివార‌ణ‌కు పూనుకోవ‌డం పీక‌ల మీద‌కు వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

దీనికంత‌టికీ కార‌ణం స్పీక‌రే అనే ఆయ‌న‌పై కస్సుబుస్సుమ‌న్నార‌ట సీఎంసాబ్‌. ఓవైపు మా గొంతు నొక్కేస్తున్నార‌ని బీఆరెస్ గ‌గ్గోలు పెట్టిన నేప‌థ్యంలో స్పీక‌ర్ స‌మ‌య‌స్పూర్తిని ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టి స‌భ‌ను న‌డిపించిన వైనాన్ని అంద‌రూ ప్ర‌శంసించారు. కానీ ఎందుకో సీఎంకే న‌చ్చ‌లేదు. త‌న చ‌ర్య‌లు అంతిమంగా సీఎంకు, పార్టీకి, ప్ర‌భుత్వానికే మంచి పేరును తెచ్చిపెడుతాయ‌నే భావ‌న‌లో స్పీక‌ర్ కొంత సంయ‌మ‌నం పాటిస్తూ బ్య‌లెన్స్‌గా ఉండి స‌భ‌ను నడిపించారు. ఇదే సీఎం కోపానికి కార‌ణ‌మై కూర్చుంది.

You missed