(దండుగుల శ్రీనివాస్)
రెడ్లు ఏకమయ్యారు. వాడు కాకపోతే వీడు. కానీ మనోడే గెలవాల్రోయ్. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. మన రెడ్డే గెలవాలే. మన రెడ్డే నిలవాలె. వాడెవడో మధ్యలో బీసీ అంట. వానికి బాగానే మద్దతున్నది. ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వొద్దు. గుద్దున్రి మన రెడ్డి బిడ్డకే. అంటున్నారు రెడ్లంతా. నరేందర్‌రెడ్డి ఓడుతున్నడు. ఓడుతున్నడు. ఓడుతున్నడు. అని ఒకటే పాట మొదలు పెట్టినంక ఇక రెడ్లంతా అంజిరెడ్డికి షిఫ్ట్ అయ్యిండ్రు.
వన్‌సైడ్ గుద్దుడు గుద్దితే మనోడే గెలుస్తడు. దీనికి తోడు కొన్ని బీజేపీ ఓట్లు కూడా మంచిగనే తోడైతయి. అటు ఇటూ గాకుండా ఒక్కతాటిపైకొచ్చి ఐకమత్యంతో గుద్దుదాం. మనోన్నే గద్దెనెక్కిద్దం. రెడీ అయిపోండి. రెడ్డికే గుద్దేతందుకు. బీ రెడీ… బీ రెడ్డీ.. నో బీసీ… గోసి. ఓకేనా..!